భారత్లో కొత్త వేరియంట్ కలకలం రేపుతుంది. మంకీపాక్స్ క్లాడ్ 1బి మొదటి కేసు నమోదైంది. ఈ విషయాన్ని అధికారిక వర్గాలు సోమవారం ధృవీకరించాయి. గత నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన మంకీపాక్స్ జాతి అని అధికారులు తెలిపారు. ఈ Mpox క్లాడ్ 1B వేరియంట్ కేసు కేరళకు చెందిన ఒక వ్యక్తిలో కనుగొన్నారు.
భారత్లో రెండో మంకీపాక్స్ కేసు నమోదైంది. కేరళ ప్రభుత్వం బుధవారం దీనిని ధృవీకరించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) నుండి ఇటీవల తిరిగి వచ్చిన 38 ఏళ్ల వ్యక్తికి ఈ ఇన్ఫెక్షన్ సోకినట్లు గుర్తించారు. మలప్పురానికి చెందిన 38 ఏళ్ల వ్యక్తి యూఏఈ నుంచి తిరిగి వచ్చిన తర్వాత పాజిటివ్గా తేలిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.
Nipah Virus: నిపా వైరస్ కేరళని మరోసారి భయపెడుతోంది. మలప్పురం జల్లాలో 24 ఏళ్ల వ్యక్తి వైరస్ బారిన పడి మరణించాడు. దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లా యంత్రాంగం నిపా మరణాన్ని ధ్రువీకరించిన తర్వాత ఫేస్ మాస్కులు ధరించడంతో పాటు పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించింది. మలప్పురం జిల్లాలోని తిరువల్లి గ్రామపంచాయతీ, మంపట్ గ్రామపంచాయతీ లోని పలు వార్డుల్లో ఆంక్షలు విధించారు.
Nipah virus: నిపా వైరస్ కారణంగా కేరళలో ఒక వ్యక్తి మరణించినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మలప్పురం జిల్లాకు చెందిన వ్యక్తి మరణించినట్లు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఆదివారం తెలిపారు. 24 ఏళ్ల వ్యక్తి మలప్పురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. రీజనల్ మెడికల్ ఆఫీసర్ డెత్ ఇన్వెస్టిగేషన్ తర్వాత నిఫా ఇన్ఫెక్షన్ అనుమానం తలెత్తిందని వీణా జార్జ్ చెప్పారు. వ్యక్తి నమూనాలను వెంటనే పరీక్ష కోసం పంపామని, అందులో…
వయనాడ్లో ఇటీవల వరదలతో పాటు కొండచరియలు విరిగి పడిన ఘటనలో తొమ్మిది మంది కుటుంబ సభ్యులను కోల్పోయిన యువతి జీవితంలో మరో పెనువిషాదం చోటుచేసుకుంది. తల్లిదండ్రులతో సహా తొమ్మిది మంది కుటుంబసభ్యులను ఒకేసారి కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న ఆమెపై విధి మరోసారి కన్నెర్ర చేసింది. సర్వస్వం కోల్పోయి.. ఇప్పుడిప్పుడే గుండె నిబ్బరం చేసుకొని ముందుకు సాగుతున్న ఆమె జీవితంలో మరో పెనువిషాదం చోటుచేసుకుంది. జీవితాంతం తోడునీడగా ఉంటానంటూ మాటిచ్చిన వ్యక్తిని విధి.. రోడ్డు ప్రమాదం రూపంలో…
కేరళలోని తిరువనంతపురంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పప్పనంకోడ్లోని ఇన్సూరెన్స్ కార్యాలయంలో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు సజీవదహనం అయ్యారు. ఇద్దరు మహిళలు చనిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
JP Nadda: మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన సంచలన విషయాలను హేమా కమిటీ వెలుగులోకి తీసుకువచ్చింది. పలువురు స్టార్ యాక్టర్స్ మహిళా టెక్నీషియన్స్, నటీమణులపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించింది. దీనికి తోడు పలువురు నటీమణులు తాము ఎదుర్కొన్న కొన్ని వేధింపుల గురించి చెప్పడం సంచలనంగా మారింది.
Malayalam cinema: మలయాళ సినీ పరిశ్రమలో మహిళా వేధింపులపై ఇటీవల హేమా కమిటి సమర్పించిన నివేదిక సంచలనంగా మారింది. కొందరు అగ్ర నటులుపై వచ్చిన ఆరోపణలు ప్రకంపలను రేపుతున్నాయి. మలయాళ పరిశ్రమలో మహిళా నటులపై కమిట్మెంట్ల పేరుతో వేధింపులు జరిగినట్లు కమిటీ తన నివేదికలో పేర్కొంది. అయితే, పరిశ్రమపై వస్తున్న ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు కేరళ ప్రభుత్వం సిద్ధమైంది. మహిళా ఐఏఎస్ అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయాలని పినరయి విజయన్ సర్కార్ ఆదివారం నిర్ణయించింది.
కేరళ చలనచిత్ర అకాడమీ ఛైర్మన్ పదవికి సినీ నిర్మాత రంజిత్ బాలకృష్ణన్ రాజీనామా చేసారు. మలయాళ చిత్రసీమలో మహిళలు లైంగిక వేధింపుల నుండి వేతన వ్యత్యాసాల వరకు ఎదుర్కొంటున్న 17 సమస్యల పరిస్థితులపై హేమ కమిటీ ఇచ్చిన రిపోర్టు బహిర్గతం కావడం మలయాళ చిత్ర పరిశ్రమలో రాజకీయ దుమారానికి దారితీసింది. చిత్ర పరిశ్రమలోని మహిళల నుంచి వెల్లువల ఫిర్యాదులు రావడంతో కేరళ చలనచిత్ర అకాడమీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసి ఆ పదవి నుండి వైదొలిగారు సినీ…