Sonia Gandhi: కేరళలోని మున్నార్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. మున్నార్‌లో సోనియా గాంధీ అనే మహిళ బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తోంది. 34 ఏళ్ల సోనియా గాంధీ మున్నార్ పంచాయతీలోని 16వ వార్డు నల్లతన్ని నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆసక్తికరంగా ఆమె తండ్రి బలమైన కాంగ్రెస్ మద్దతుదారుడు.. మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలైన సోనియా గాంధీ ప్రేరణతో తన కుమార్తెకు ఆ పేరు పెట్టారు. ఈ విషయం బీజేపీ అభ్యర్థి సోనియా గాంధీ స్వయంగా తెలియజేశారు. తన తండ్రి కట్టర్ కాంగ్రెస్ వాది అని అందుకే ఆయన తనకు ఆ పేరు పెట్టారని సోనియా చెప్పారు. తన కుటుంబం మొత్తం నేటికీ కాంగ్రెస్ మద్దతుదారులుగానే ఉందని తెలిపారు.
READ MORE: Maruti Suzuki: మారుతి సుజుకి చరిత్ర.. 30 రోజుల్లో 2.29 లక్షల కార్ల విక్రయాలు!
తన భర్త మాత్రం బీజేపీలో ఉన్నారని, అందుకే తాను ఇప్పుడు బీజేపీ టికెట్ పై ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని సోనియా వివరించారు. ఆమె భర్త సుభాష్, ఏడాదిన్నర క్రితం పాత మున్నార్ మూలకడై ప్రాంతంలో జరిగిన పంచాయతీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఇదే స్థానంలో కాంగ్రెస్‌కు చెందిన మంజుల రమేష్, సీపీఎంకు చెందిన వలర్మతిపై పోటీ చేస్తున్నారు. కాగా.. కేరళలో పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబర్ 9- 11 తేదీలలో రెండు దశల్లో జరుగుతాయి. రాష్ట్రంలోని 941 గ్రామ పంచాయతీలు, 152 బ్లాక్ పంచాయతీలు, 14 జిల్లా పంచాయతీలు, 87 మునిసిపాలిటీలు, ఆరు మునిసిపల్ కార్పొరేషన్లలో ఓటింగ్ జరుగుతుంది.
READ MORE: Samantha–Raj : ఫోటోలు వైరల్.. ఫిబ్రవరిలోనే సమంత-రాజ్ ఎంగేజ్మెంట్ .. !