Kerala: లెఫ్ట్ కూటమి ఓడిపాయె.. ‘‘మీసాలు’’ పోయె..
- కేరళ స్థానిక ఎన్నికల్లో అధికార వామపక్ష కూటమికి భారీ దెబ్బ..
- కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు భారీ విజయం..
- ఓటమి కారణంగా మీసాలు గీయించుకున్న లెఫ్ట్ కార్యకర్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala: కేరళ లోకల్ బాడీ ఎన్నికల్లో అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్) ఘోర పరాజయం పాలైంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రండ్(యూడీఎఫ్) అధిక స్థానాల్లో విజయాన్ని కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే, బీజేపీ కూడా తన రాష్ట్ర రాజధాని తిరువనంతపురం కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే, వామపక్ష కూటమి విజయంపై ధీమా వ్యక్తం చేసిన లెఫ్ట్ కార్యకర్త ఒకరు తన ‘‘మీసం’’ కోల్పోవాల్సి వచ్చింది.
పతనంతిట్ట మన్సిపాలిటీ ఎన్నికల ముందు, ఈ ప్రాంతంలో ఎల్డీఎఫ్ తన అధికారాన్ని నిలుపుకోకపోతే తానున మీసాలు తీసేస్తానని వామపక్ష కార్యకర్త బాబు వర్గీస్ బహిరంగంగా ప్రతిజ్ఞ చేశాడు. శనివారం ఎన్నికల ఫలితాల్లో పతనంతిట్ట మున్సిపాలిటీ మాత్రమే కాకుండా, ఆ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అధికార ఎల్డీఎఫ్ కూటమికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్ పతనంతిట్ట, తిరువల్ల, పండలంతో సహా నాలుగు మున్సిపాలిటీలను గెలుచుకుంది. గతంలో ఈ మూడు వామపక్షాల ఆధీనంలో ఉండేవి.
Also Read
- PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
- Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
- UPSC Centenary 2026: UPSC శతాబ్ది వేడుకలు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వందేళ్ల చరిత్ర ఇదే
అయితే, ఎన్నికలకు ముందు ప్రచారం సమయంలో వామపక్ష కూటమి విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ, బాబు వర్గీస్ తన స్నేహితులతో పందెం కాశాడు. ఇప్పుడు తన కూటమి ఘోర పరాజయం పాలవ్వడంతో మీసం తీసేస్తాననే తన ప్రతిజ్ఞను నెరవేర్చాడు. స్థానిక సెలూన్‌కు వెళ్లి తన మీసాలు గీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
2025 స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు రాష్ట్రవ్యాప్తంగా యూడీఎఫ్ అఖండ విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 86 మునిసిపాలిటీలలో 54, 941 గ్రామ పంచాయతీలలో 504, మరియు 152 బ్లాక్ పంచాయతీలలో 79 స్థానాలను కైవసం చేసుకుంది. మరోవైపు, వామపక్షాలకు కంచుకోటగా ఉన్న తిరువనంతపురం కార్పొరేషన్‌లో 101 స్థానాలకు గానూ బీజేపీ 50 స్థానాలు గెలుచుకుంది. ఈ నగరంలో వామపక్షాలు 29, కాంగ్రెస్ కూటమి 19 స్థానాలు గెలిచాయి. గత నాలుగు దశాబ్ధాల వామపక్షాల ఆధిపత్యానికి బీజేపీ గండికొట్టింది.
LDF party worker Babu Varghese, who had vowed to shave his moustache if the LDF failed to win the Pathanamthitta Municipality, has now gone through with it after the party’s defeat. #Pathanamthitta #LDF #KeralaLocalBodyElection2025 #KeralaLocalBodyElection pic.twitter.com/gxQ9dKFQSt
— Harish M (@chnmharish) December 13, 2025
తాజావార్తలు
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
-
PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
ట్రెండింగ్
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!