చెరువులు, నదుల్లో చేపల వేట కొందరికి సరదా. మరికొందరికి జీవనోపాధి, చేపల కోసం వలవేస్తే కొందరికి తాబేళ్ళు, పాములు, కప్పలు గట్రా పడుతుంటాయి. ఒడిశాలో చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడి వలలో పడ్డ దాన్ని చూసి మైండ్ బ్లాంక్ అయింది. కళ్ళు బైర్లు కమ్మాయి. వలలో ఏకంగా ఒక మొసలి చిక్కడమే అందుకు కారణం. ఇవాళ నా పంట పండిందనుకుని వల పైకి లాగితే సర్రున మొసలి రావడంతో ఆ మత్స్యకారుడు అవాక్కయ్యాడు. వెంటనే అటవీ…