సంచలనం కలిగించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలకాంశాలు బయటకు వస్తున్నాయి. ఈడీ దాఖలుచేసిన కోర్టీ ధిక్కరణ పిటిషన్ విచారణకు రానుంది. కెల్విన్ కూల్ ప్యాడ్ లో సినీతారల చిట్టా ఉందని ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. సమగ్ర దర్యాప్తు వివరాలు ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాలను పాటించడంలేదని ఈడీ కోర్టుకి తెలిపింది. సినీతారల కాల్ రికార్డ్స్ ఎక్సైజ్ శాఖ కోర్టుకు సమర్పించలేదని ఈడీ పేర్కొంది. ఇప్పటి వరకు ఆరు లేఖలు వ్రాసినా వివరాలు ఇచ్చేందుకు ఎక్సైజ్ శాఖ ససేమిరా…
టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ నేపథ్యంలో ఈడీ కార్యాలయంలో హాజరైన నటుడు తరుణ్ విచారణ ముగిసింది. 8 గంటల పాటు తరుణ్ ను అధికారులు విచారించారు. కాగా, ఈరోజుతో ముగిసిన సినీతారల విచారణ ముగిసింది. తమ బ్యాంక్ ఖాతాల వివరాలు, స్టేట్ మెంట్ లతో 12 మంది సినీ సెలబ్రిటీలు విచారణకు హాజరైయ్యారు. పూరి జగన్నాథ్ తో ప్రారంభం అయ్యిన ఈడీ విచారణ, తరుణ్ తో సినీ తారల విచారణ ముగిసింది. ఆగస్ట్ 31న పూరి జగన్నాథ్…
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన సెలెబ్రెటీలకు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన కెల్విన్ సంబంధించి పలు కీలక విషయాలను ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. ఈమేరకు ఆయన ఛార్జ్ షీట్‌లో అంశాలను కూడా తెలియచేసింది. ఎక్సైజ్ శాఖ ప్రకారం.. ‘కెల్విన్ మంగళూరులో చదువుకునేటప్పుడు డ్రగ్స్ కు అలవాటు పడ్డాడు. 2013 నుంచి తన స్నేహితులకు డ్రగ్స్ అమ్మడం మొదలు పెట్టాడు. గోవా, విదేశాల నుండి డార్క్ వెబ్…
టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు కొంతమంది సెలెబ్రిటీలను ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. డ్రగ్స్, మనీలాండరింగ్ కోణంలో ఈ విచారణ సాగింది. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్ కు ఉచ్చుబిగుస్తోంది. కెల్విన్ కీలక నిందితుడిగా ఈడీ అధికారులు గుర్తించారు. తాజాగా డ్రగ్స్ కేసులో కెల్విన్ కు రంగారెడ్డి జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. డిసెంబరు 9న విచారణకు హాజరు కావాలని రంగారెడ్డి జిల్లా కోర్టు కెల్విన్ ను…
సంచలనంగా మారిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఉన్న కెల్విన్‌కు నాంప్లి కోర్టు సమన్లు జారీ చేసింది.. అయితే, ఈ సమన్లు బోయిన్‌పల్లి కేసులో జారీ అయ్యాయి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కెల్విన్‌ను 2016లో బోయిన్‌పల్లిలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేవారు.. అతడి దగ్గర ఎల్ఎస్‌డీ రకం డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసుల వివరాలతో 2016 ఆగస్టులో కెల్విన్‌పై బోయిన్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత సీసీఎస్‌లోని నార్కోటిక్స్ విభాగానికి కేసు బదిలీ అవ్వడం..…
ప్రస్తుతం టాలివుడ్ లో డ్రగ్స్ కేసు సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనుమానం ఉన్న సినీ తారలకు ఈడీ సమన్లు పంపింది. నిన్న దర్శకుడు పూరి జగన్నాథ్ ఈడీ ముందు విచారణకు కూడా హాజరయ్యారు. అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న కెల్విన్ ఈడీ ముందు అప్రూవర్గా మారినట్లు తెలుస్తుంది. 6 నెలల క్రితం కెల్విన్ పై కేసు నమోదు చేసింది ఈడీ. ఎక్సైజ్ కేసు ఆధారంగా కెల్విన్ పై ఈ కేసు నమోదు చేసింది.…