Ponnam Prabhakar: కాంగ్రెస్ వస్తే..కరువు వస్తుందని అనడం దారుణమని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. వ్యవసాయ డిగ్రీ కళశాల భవనానికి మంత్రి పొన్నం శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతూ.. గత శాసన సభ్యుడు మంజూరు చేసిన వ్యవసాయ కళశాల భవనానికి భూమి పూజ చేశామని,రాజకీయాలకు అతీతంగా చేస్తున్నామన్నారు. దేశంలో వ్యవస్థ బ్రతకాలన్న.. రైతన్నల కు సాంకేతిక అవసరమన్నారు. మెడిగడ్డలో ఏదో రెండు పిల్లర్లు కుంగినవి అనడం సరి అయినది కాదు కేసీఆర్ కు అవగాహన రాహిత్యం అన్నారు. కాంగ్రెస్ వల్ల కరువు వచ్చింది అనడం పద్దతి కాదనిచ రైతులకు భరోసాగా ఉంటామన్నారు.
Read also: Breaking : సీఎం జగన్ సమక్షంలో వైసీపీ లోకి అడుగుపెట్టిన ముద్రగడ పద్మనాభం..!
మేడిగడ్డలో రెండే పిల్లర్లు కుంగాయా కేసీఆర్? మొన్నటిదాకా అధికారంలో ఉన్నది మీరే కదా? కాంగ్రెస్ వస్తే.. కరువు వస్తుందని అనడం దారుణమని మండిపడ్డారు. కేసీఆర్ కు అవగాహన లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడూ..మా వల్ల కరువు వచ్చింది అనడని మండిపడ్డారు. పంటలు ఎండిపోతున్నాయంటూ మంత్రి ఎదుట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు నీళ్లు ఇవ్వాలని కోరారు. సెప్టెంబర్ వర్షాలు కురవక పోవడమే కారణమని.. రైతులకు వివరించారు. రైతులకు నీళ్లు ఇవ్వద్దని ఏ రాజకీయ నాయకుడు, ఏ వెధవ అనుకోడంటూ సమాధానం ఇచ్చారు.
Electoral Bonds Case: ఎస్‌బీఐకి నోటీసులిచ్చిన సీజేఐ.. ఎలక్ట్రోరల్ బాండ్ డేటాలో బాండ్ నంబర్ ఎక్కడ?