Komatireddy Venkat Reddy: బీఆర్ఎస్ లో మిగిలేది ఆ నలుగురే..అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలసారి స్వగ్రామం నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణవెల్లంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. గ్రామానికి వచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ఘన స్వాగతం పలికారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి మాట్లాడుతూ.. 30 కోట్ల రూపాయల నిధులతో నల్గొండ – బ్రహ్మణవెల్లముల రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశామన్నారు. రూ. 25 కోట్ల రూపాయల నిధులతో నిర్మిస్తున్న బ్రహ్మణవెల్లముల- చిట్యాల రోడ్డు పనులకు శంకుస్థాపన, రూ.12 కోట్ల రూపాయల నిధులతో బ్రహ్మణవెల్లముల గ్రామంలో రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించే పనులకు శంకుస్థాపన చేశామని అన్నారు. నాకు పేరు వస్తుందని కేసిఆర్ SLBC ప్రాజెక్ట్ ను నిర్లక్ష్యం చేశారని అన్నారు. రెండేళ్లలో SLBC ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తా అన్నారు.
Read also: RS Praveen Kumar: బీఆర్ఎస్- బీఎస్పీ పొత్తు.. ఆర్‌ఎస్‌పీ పోటీ అక్కడి నుంచే..
బీఆర్ఎస్ లో మిగిలేది ఆ నలుగురే అని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుండి బీజేపీ, కాంగ్రెస్ లలోకి వలసలు తప్ప ఆ పార్టీలో ఏమీ మిగలదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ కోసం కొట్లాడిన.. నేను ఎక్కడ అవినీతికి పాల్పడలేదని క్లారిటీ ఇచ్చారు. నాబలం, బలగం నా సొంత గ్రామం బ్రాహ్మణ వెల్లం అన్నారు. ఆరు నెలల్లో నా సొంత గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా అని హామీ ఇచ్చారు. గ్రామంలో అభివృద్ధి కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం గ్రామంలో కార్యాలయం ఏర్పాటు చేస్తున్నానని తెలిపారు. సమర్థవంతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మరోసారి పట్టం కట్టాలన్నారు.
Gutha Sukender Reddy: రేవంత్ నాకు బంధువే కానీ.. అసెంబ్లీలో తప్పా ఎక్కడ కలవలేదు..!