ప్రతిపక్షంలోకి వచ్చాక బీఆర్ఎస్కు షాకుల మీద షాక్‌లు తగులుతున్నాయి. పదేళ్ళపాటు తిరుగులేని అధికారాన్ని చెలాయించిన పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో పవర్ కోల్పోవడం ఒక ఎత్తయితే....ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం మరింత కుంగదీసింది. ఇక పార్టీని రీ ఛార్జ్ చేయాలి, గ్రామస్థాయి నుంచి మళ్ళీ పటిష్టం చేయడం కోసం జనంలోకి దూకుడుగా వెళ్ళాలనుకుంటున్న టైంలో... కవిత రూపంలో ఊహించని మాస్టర్ స్ట్రోక్ తగిలింది. మూడు నెలల క్రితమే తేడా వచ్చినా...…
తెలంగాణలో పార్టీ మారి... మెడమీద అనర్హత కత్తి వేలాడుతున్న ఎమ్మెల్యేల్లో చాలామంది వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. టెక్నికల్ మాట్లాడుతున్నారు. పార్టీ మారలేదని కొందరు, అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశామని మరికొందరు చెప్పుకుంటున్నారు. మరోవైపు అనర్హత పిటిషన్ విషయంలో... చర్చ సీరియస్‌గానే నడుస్తోంది. స్పీకర్‌కి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు కూడా దగ్గర పడుతుండటంతో... ఇక నాన్చకుండా... ఏదో ఒక చర్య తీసుకునే అవకాశం ఉందనే టాక్ గట్టిగానే ఉంది పొలిటికల్ సర్కిల్స్‌లో.
తెలంగాణలో రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. గత కొంత కాలంగా బీఆర్ఎస్ లో అతర్గత వ్యవహారాలు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కల్వకుంట్ల కవిత పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న తీరుపై ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో హరీష్ రావు అవినీతికి పాల్పడ్డాడని బహిరంగంగానే బయటపెట్టింది కవిత. అంతేకాదు సంతోష్ రావు కూడా కుట్రలు పన్నుతున్నాడని తెలిపింది. దీంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. దీంతో బీఆర్ఎస్ అధినేత…
ప్రస్తుతం కవిత సస్పెన్షనే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్. వరుస ప్రెస్ మీట్లతో బీఆర్ఎస్ను ఆమె డిఫెన్స్ లో పడేస్తోంది. అలాగని కవితను తక్కువగా అంచనా వేయడానికి ఆస్కారం లేదు. మొదట్నుంచీ కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్‌తో కలిసి ఉన్న కవిత.. చెప్పే మాటలు, చేసే ఆరోపణలు కచ్చితంగా జనం నమ్మే అవకాశం ఉంది. ఈ విషయమే బీఆర్ఎస్ కు పెద్ద సమస్యగా మారింది.
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసులో మాజీ సీఎం కేసీఆర్‌పై చర్యలు తీసుకోకుండా.. సీబీఐ విచారణకు ఎందుకు ఇచ్చినట్టు అని ప్రభుత్వంను ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. సీబీఐ మీద నమ్మకం లేదన్న కాంగ్రెస్.. ఇప్పుడు ఎందుకు ఇచ్చినట్టు అని విమర్శించారు. బీజేపీపై బట్ట కాల్చి మీద వేసేందుకు సీబీఐకి కేసు అప్పగించారని.. సీబీఐకి ఈ ప్రభుత్వం సహకరిస్తుందన్న నమ్మకం తనకు లేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనే చెప్పేందుకు.. ఇదంతా ఒక పన్నాగం అని మండిపడ్డారు. బీఆర్ఎస్ను…
‘నాన్నా.. మీ చుట్టూ ఏం జరుగుతుందో ఓసారి చూసుకోండి’ అని బీఆర్ఎస్ అధినేత, తన తండ్రి కేసీఆర్‌ను కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకునే కుట్ర జరుగుతోందని, మీకు ప్రమాదం పొంచి ఉందని సూచించారు. తమ కుటుంబం విచ్ఛిన్నమైతేనే కొందరికి అధికారం వస్తుందని.. ఇందులో భాగంగానే మొదటగా తనను బయటకు పంపించారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన ఉన్నవాళ్లు, వ్యక్తిగత లబ్ధి పొందాలనుకునే వాళ్లు.. మన ముగ్గురం (కేసీఆర్,…
Kalvakuntla Kavitha on Future Plans: తన తండ్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని తాను శిరసావహిస్తా? అని కల్వకుంట్ల కవిత తెలిపారు. తనను ఏ రోజు బీఆర్ఎస్ పార్టీ వివరణ కోరలేదని చెప్పారు. తాను ఏ పార్టీలో చేరను అని, ఏ పార్టీతోనూ తనకు అవసరం లేదని స్పష్టం చేశారు. కవితను మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈరోజు హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియా…
పదేళ్ల పాటు తిరుగులేని అధికారం చెలాయించిన బీఆర్ఎస్.. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలైంది. ఆ తర్వాత నెలల వ్యవధిలోనే ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయ్యారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో అయితే పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది.