కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వడ్లన్నీ తడిశాయని బీజేపీ రాష్ర్ట అధ్యక్షడు బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీరాష్ట్ర అధ్యక్షుడిగా నేను రెండు రోజుల పాటు నల్లగొండ, సూర్యాపేట జిల్లాలలో వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను కలవడానికి వెళ్తే టీఆర్ఎస్ నాయకులతో, కార్యకర్తలతో రాళ్లతో, కట్టెలతో దాడి చేయించే ప్రయత్నం చేశారు. కానీ నేను మొన్న కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులతో మాట్లాడిన తర్వాత ఏ అంశాలు లేవనెత్తానో అవే ఈరోజు…
వడ్లకొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు డ్రామాలు ఆడుతున్నాయని ఇప్పటికే రైతులు కల్లాల వద్ద వడ్లను పోసి ఉంచినా కొనుగోలు కేంద్రాలు సరిపడినన్ని లేవని సీపీఐరాష్ర్ట కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలను విమర్శించారు. కేంద్రం రైతు చట్టాలను ఉప సంహారించుకోవడం సదుద్దేశమైనప్పటికీ, దీని వెను రాజకీయ కార ణాలను కొట్టిపారేయలేమని ఆయన అన్నారు. ఇప్పటికే దీనిపై రైతు లు గత సంవత్సర కాలంగా అలుపెరుగని పోరాటం…
దేశంలోనే తెలంగాణలో వరీ ఎక్కువ విస్తీర్ణంలో పండుతోందని అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం ప్రవేశపెట్టిన రైతుసాగుచట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. అయితే తాజా ప్రధాని నరేంద్ర మోడీ ఆ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. రేపు సీతారామ ప్రాజెక్ట్ తర్వాత రైతులు ఇంకా ఎక్కువ పంట వేస్తారని, పంట కొనం అంటే రైతుల కాళ్ళు కట్టేసినట్లేనన్నారు.…
కేసీఆర్ అనాలోచితనిర్ణయం వల్ల రాష్ర్ట ఆర్థికస్థితి దిగజారిందని ఈట రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. కేసీఆర్‌పై విమర్శల బాణాలను సంధించారు. పైరవీలు చేసుకున్న వాళ్లకే బిల్లులు చెల్లిస్తున్నార న్నారు. రైతు రుణ మాఫీలో 24వేల కోట్లలో 5వేల కోట్లు కూడా చెల్లిం చలేదు. ఒకవేళ ఇచ్చినా డబ్బు కేవలం రైతుల వడ్డీ కట్టాడానికే సరి పోయింది. ఒక రైతుబంధు ఇచ్చి రైతులకు రావాల్సిన ఇన్పుట్ సబ్సీడీ, ఫసల్…
వినయం, విధేయత, స్వామిభక్తి.. ఇవన్నీ వుంటే ఏదైనా సాధించవచ్చు. వడ్డించేవాడు మనవాడైతే ఫంక్తిలో ఎక్కడ కూర్చున్నా మన విస్తరిలోకి అన్నిరకాల రుచులు వచ్చిపడతాయని మరోసారి నిరూపణ అయింది. పెద్దల సభ అంటే కొందరికి మక్కువ. రాజకీయాల్లో జనంలో తిరగకుండా.. దండాలు పెట్టకుండా హాయిగా అయినవారి ఆశీస్సులు వుంటే హాయిగా పెద్దల సభలో దర్జాగా కాలు పెట్టేయవచ్చు. తెలంగాణ రాజకీయాల్లో సిద్దిపేట కలెక్టర్‌గా పనిచేసి రాజీనామా చేసిన పారుపాటి వెంకట్రామిరెడ్డి గురించి హాట్ టాపిక్ అవుతోంది. ఆయన పదవికి…
కేసీఆర్ చేస్తున్న ధర్నాపై కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందిస్తూ .. కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటను రాష్ర్ట, కేంద్రప్రభుత్వాలు కొనకుంటే ఎవ్వరూ కొంటారని ఆయన ప్రశ్నించారు. చైనా, శ్రీలంక, బర్మా, పాకిస్తాన్ దేశాలు కొంటాయ అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ నీకు పాలన చేతకాకుంటే వదిలేయ్ అని భట్టీ అన్నారు. కేంద్ర ప్రభు త్వం తీసుకొచ్చే నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేద్దామంటే…
వరి ధాన్యం విషయంలో ధర్నా చేస్తున్న కేసీఆర్‌పై వైఖరిని తప్పు బడుతూ.. కేంద్రప్రభుత్వ వర్గాలు స్పందించాయి.గత ఖరీఫ్‌లో 32 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేంద్రం కొన్నది. ఈ ఏడాది 25 శాతానికి పెంచి, 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోలు చేసేందుకు నిర్ణయించాం. ఈ ఖరీఫ్ సీజన్లో 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం (60 లక్షల ధాన్యం) కొనుగోలు చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుంది. గత రబీ సీజన్లో ఇచ్చిన హామీ మేరకు…
కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ అధినేత సహా టీఆర్ఎస్ శ్రేణులు ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు లతో పాటు భారీ ఎత్తున్న టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. అయితే ఈ మహా ధర్నా అనంతరం టీఆర్ఎస్ పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మహాధర్నా ముగిశాక రాజ్‌భవన్‌కు పాదయాత్రగా వెళ్లనున్నట్లు సమాచారం. సీఎం కేసీఆర్‌తో పాటు ప్రజా ప్రతినిధులంతా రాజ్‌భవన్‌కు పాదయాత్రగా వెళ్లే అవకాశం ఉంది. ఈ పాదయాత్ర సచివాలయం…
కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ పార్టీ అధినేత కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి నిరసనగా ధర్నాకు పిలుపునిచ్చారు. అయితే బీజేపీ నేతలేమో ధాన్యం కొనుగోలు చేతకాకనే కేంద్రంపై ఆరోపణలకు దిగుతున్నారని విమర్శిస్తున్నారు. ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతల మాటలతో రైతుల్లో గందరగోళం నెలకొంది. స్వరాష్ట్ర సాధన కోసం పోరాడిన టీఆర్ఎస్కు పోరాటాలు కొత్తకావంటూ.. రైతుల కోసం పోరాటం చేస్తామంటూ అధికార పార్టీ నేతలు రోడ్లెక్కారు. అయితే తెలంగాణలో…
మొన్నటి వరకు కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన వెంకట్రామిరెడ్డి ఎన్నో ఆరోపణలు, విమర్శల నడుమ ఎమ్మెల్సీ పదవిని పొందారు. అయితే టీఆర్ఎస్ పార్టీ ఇందిరాపార్క్ వద్ద చేస్తోన్న మహాధర్నాలో పాల్గొన్న ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందని అన్నారు. కేసీఆర్ కృషితో గతంలో కంటే 600 శాతం ఎక్కువ ధాన్యం పండుతోందని, రైతుల పంటలు కేంద్రం ఎందుకు కొనుగోలు చేయదని, అకస్మాత్తుగా రైతులు వరి పంట పండించొద్దని అంటే ఎలా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ చాలా…