తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నిజామాబాద్ స్థానిక సంస్థ కోటా టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న కేసీఆర్ కూతురు కవితను మరోసారి ఎమ్మెల్సీగా ఖరారు చేసింది. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కవిత పదవీకాలం జనవరి 4న ముగియనుంది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది.
రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాష్‌కు ఎమ్మెల్సీ ఇవ్వడంతో ఆ రాజ్యసభ ఆ స్థానంలో రాజ్యసభకు కవితను వెళ్లబోతుందంటూ ప్రచారం జోరుగానే సాగింది. కానీ మళ్లీ నిజామాబాద్ నుంచే ఆమె స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అభ్యర్థిగా బరిలోకి దిగారు. గతలో కవిత ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అనంతరం ఎమ్మెల్సీగా విజయం సాధించిన విషయం తెలిసిందే.