Revanth on Modi Silence: 50 వేలకోట్ల దోపిడీపై స్పందించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో జరుగుతున్న కోల్ స్కాంపై మోడీ ప్రభుత్వం మౌనంగా ఉండడం ఎందుకని ప్రశ్నించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేను ప్రధానికి.. కోల్ ఇండియాకి ఫిర్యాదు చేశాం. డీవోపీటీ నిబంధనలకు విరుద్ధంగా శ్రీధర్ ని సీఎండీగా కొనసాగిస్తున్నారు. 50 వేల కోట్ల దోపిడీకి పాల్పడుతోంది. ప్రధాని, కోల్ సెక్రెటరీ లకు ఫిర్యాదు చేశాం. కేంద్ర మైనింగ్ మినిస్టర్ కి ఫిర్యాదు చేస్తే..మేము చేసేది ఏమీ లేదు ప్రధాని కార్యాలయం చూసుకుంటుంది అని చెప్పారు.
సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కి ఫిర్యాదు ఫార్వర్డ్ చేయండి అని అడిగాం. అది కూడా చేయలేను అని చెప్పారు కేంద్ర మంత్రి. ప్రధానికీ, కేసీఆర్‌కీ ఎంత అనుబంధం ఉందో అర్దం చేసుకోవచ్చు. శ్రీధర్ నిర్ణయాలతో జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ప్రైవేట్ కాంట్రాక్టర్ లకు లబ్ది చేకూర్చే ప్రయత్నం చేశారు. టెండర్ అయ్యాక… టెండర్ దారుడు ఇంకో పెట్టుబడి దారున్ని తెచ్చుకోవచ్చు అని నిబంధన పెట్టారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
కేసీఆర్-మోడీకి అసలు పడనప్పుడు సింగరేణి సంస్థ అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అధాని దగ్గర కరెంట్ కొనాలని మోడీ ఒత్తిడి పెంచుతున్నారు అని కేసీఆర్ చెప్తున్నారు. మరి సింగరేణి బొగ్గు ను అదానీ కి కట్టపెడుతుంటే నీకు కనిపించడం లేదా..? అని రేవంత్ ప్రశ్నించారు. భూగర్భ గనుల ను కేసీఆర్ కుటుంబం దోచేస్తోందన్నారు. కేంద్రం ఎందుకు నివేదిక అడగలేదు. కేంద్రం వాటా ఉన్న సంస్థ లో 50 వేల కోట్ల అవినీతి జరుగుతుంటే ఎందుకు మోడీ స్పందించడం లేదు. అమిత్ షా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు
కేంద్రం సైలెంట్ గా ఉంది అంటే మోడీ- కేసీఆర్ అవినీతికి మద్దతు ఇస్తున్నట్టు కదా..? కెసిఆర్ దోపిడీ కి పాల్పడితే… జైలుకు పంపిస్తా అంటున్న సంజయ్..కిషన్ రెడ్డి కి సవాల్ విసురుతున్నారు. మేము ఫిర్యాదులు చేసినా ఎందుకు విచారణ చేయడం లేదు? శ్రీధర్ మీద తీవ్ర విమర్శలు ఉన్నప్పుడు కేంద్రం ఎందుకు స్పందించడం లేదన్నారు రేవంత్ రెడ్డి. దీని వెనక..మోడీ..కేసీఆర్ కి ఉన్న చీకటి వ్యవహారం ఏంటి..? కేసీఆర్- యూపీయేను బలహీన పర్చి ఎన్డీయేని ని పెంచే పనిలో ఉన్నారు. మోడీ దగ్గర కేసీఆర్ సుపారీ తీసుకున్నాడని రేవంత్ ఆరోపించారు.
కాంగ్రెస్ కి అనుబంధంగా ఉండే పార్టీలతో కలిసి యూపీయేని బలహీనపరిచే పనిచేస్తున్నారు. దేవెగౌడ నాకు సహకరిస్తున్నారు అని కేసీఆర్ చెప్పారు. కానీ కేసీఆర్‌తో వ్యక్తిగత పనుల మీద మాట్లాడినా అని చెప్పారు.
శరద్ పవార్ ఏమో తెలంగాణ..మహారాష్ట్ర అభివృద్ది చర్చ చేశాం అని ట్వీట్ చేశారు. మహారాష్ట్ర సీఎంవో… రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం…పరిశ్రమ వివాదంపై చర్చించాను అని ట్వీట్ చేశారు. సుప్రియ సులే కూడా అభివృద్ధి పైనే చర్చ చేశాం అని ట్వీట్ చేశారు. కేసీఆర్ కూటమి గురించి ఎక్కడ మాట్లాడలేదు అని వాళ్ళు పోస్ట్ చేశారు. నిజంగానే మోడీకి వ్యతిరేకంగా మాట్లాడాలి అని కెసిఆర్ అనుకుంటే ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలన్నారు. దేశ్ కి నేతా అంటే అయిపోతారా? రాష్ట్ర పతి నువ్వే అని శరద్ పవార్ కి చెప్పాడంట కేసీఆర్. అలాంటి ఆలోచన ఏమీ లేదు. నీకేమైనా ఉంటే..నువ్వు ప్రయత్నం చేసుకో అని శరద్ పవర్ చెప్పాడంటున్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!