మహబుబ్ నగర్ జిల్లా ఆత్మకూర్ బీజేపీ బహిరంగ సభలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు పాల్గొన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ.. మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాష్టంలోని అన్ని నియోజకవర్గాలలో మహాసభలు పెడుతున్నట్లు తెలిపారు. బీజేపీ 9 ఏళ్లలో చేసిన అభివృద్దిని ప్రజలకు చేరువ చేయడమే కార్యక్రమం ఉద్దేశ్యమన్నారు. నరేంద్ర మోడీ ప్రధానిగా వుండటం మనం చేసుకున్న అదృష్టమని బండి సంజయ్ అన్నారు. దేశ ప్రధాని బాత్ రూంల గురించి మాట్లాడితే…
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం జిల్లా చెరువు గ్రామంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా.. ఆయన మాట్లాడుతూ.. మధ్యలో వచ్చిన నాయకులు మధ్యలోనే కొట్టుకొని పోతారని విమర్శించారు. దోపిడీలు చేసే నాయకులు ప్రజల గుండెల్లో ఉండాలని.. వారు దొంగలుగా ముద్రించబడతారని ఆరోపించారు. మూడు ఎకరాలు ఇస్తామని.. కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు ప్రజలను నట్టేటా ముంచారని భట్టి…
కరీంనగర్ నగరం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది అని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టాక చెప్పిన మాటలు ప్రస్తుతం నిజం అవుతున్నాయని ఆయన వెల్లడించారు. నగరం రోడ్ల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.. రాష్ట్రంలో రెండవ నగరంగా కరీంనగర్ అభివృద్ధి చెందింది అని మంత్రి గంగులా అన్నారు.
పొంగులేటి కాంగ్రెస్ లో చేరినా.. ఖమ్మం లో మెజార్టీ స్థానాల్లో మేము గెలుస్తామని మా స్ట్రాటజీ మాకు ఉందని బీజేపీ నిజామాబాద్ ఎంపీ అర్వింద్ తెలిపారు. ఆర్మూరు మండలం అంకాపూర్ లో మేరా బూత్ సబ్ సే మజ్ బూత్ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగాన్ని వీక్షించారు.
సీఎం కేసీఆర్ ఉదయం 8 గంటలకు పండరీపురం వెళ్లనున్నారు. అక్కడ రుక్మిణి సమేతంగా విఠేశ్వరస్వామిని పూజిస్తారు. ఆ తర్వాత షోలాపూర్ జిల్లా సర్కోలి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరవుతారు.
Revanth Reddy fires on KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబం మీద టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. మేడ్చల్ జిల్లా కేసీఆర్ దత్తత గ్రామం మూఢుచింతలపల్లి లక్ష్మాపూర్ లో రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ గతంలో కుమ్మరి ఎల్లవ్వ ఇంటికి వచ్చి చూస్తే.. మురికి నీరు అంతా ఆ ఇంట్లోకే వెళ్ళేదని, కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్ళడానికి మంచి దారి వేసుకున్నాడని అన్నారు. రోడ్డు ఎల్లవ్వ…
కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని, కాంగ్రెస్ ను నడిపించేది కేసీఆరేనని అన్నారు. అట్లాంటప్పడు కేసీఆర్ ను ఓడించడమే ధ్యేయమని చెబుతున్న నేతలు కాంగ్రెస్ లో ఎందుకు వెళ్లాలనుకుంటున్నారో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణ కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భూమిపూజకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రానున్నారు. నాగులపల్లిలో రైల్వే కోచ్ తయారీ కేంద్రం, కొల్లూరులో డబుల్ బెడ్ రూం పనులకు సీఎం శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అందుకు సంబంధించిన పనులను మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ శరత్, స్ధానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పరిశీలించారు.
ఈనెల 22న(గురువారం) ముఖ్యమంత్రి కేసీఆర్ సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. పటాన్ చెరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్ పర్యటన వివరాలను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వెల్లడించారు.