ఆరు నూరైనా నా ప్రాణం అడ్డేసి మీ అందర్నీ కాపాడుకుంటానని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజా జీవితంలోనే ఉంటానని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కీలక వ్యాఖ్యలు చేశారు.
భూములను అమ్ముకోవడాని కేసీఆర్ కామారెడ్డికి వస్తున్నారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. కామారెడ్డి నుంచే సీఎం కేసీఆర్ పతనం ప్రారంభం అవుతుందని.. ఆ పార్టీని భూస్థాపితం చేద్దామని అన్నారు.
రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీ సత్తా ఏంటో తెలుస్తుందని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే చంద్రమండలం కూడా ఖతం అవుతుందని సెటైర్లు వేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాన్సర్ వ్యాధి కంటే డేంజర్ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అభివర్ణించారు. కేసీఆర్ కేన్సర్ లాంటోడు... మొదటిసారి అధికారంలోకి వచ్చి మోసం చేసిండు.. రెండోసారి అధికారంలోకి వచ్చి భూములన్నీ అమ్మేసి రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిండు అని విమర్శించాడు.
నిజామాబాద్ లో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింత్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరికి ఓటు వేసినా మాకే పడుతుంది.. బీజేపీనే గెలుస్తుంది అని సంచలన కామెంట్స్ చేశారు. ఇక, ఆవాస్ యోజన ద్వారా దేశ వ్యాప్తంగా 5 కోట్ల ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చాము.
కేసీఆర్ కుటుంబం తెలంగాణ అమరవీరుల రక్తపు కూడు తింటున్నారు అని జూపల్లి విమర్శలు గుప్పించారు. ఉప ఎన్నికల్లో మీరు పెట్టిన ఖర్చు ప్రపంచంలో ఎవరు పెట్టలేదు.. మీరు ఇందులో ఆదర్శమా.. వేల కోట్లు ఖర్చుపెడతారు.. గ్రామీణ ప్రాంతం నుంచి రాష్ట్ర నేతల వరకు అందరిని కొనాలని చూస్తారు..
ఈ సంవత్సరం చివరలో జరుగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 115 మందితో బీఆర్ఎస్ తొలి జాబితాను ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్ధులను ప్రకటించిన ఆయన పనితీరు సరిగ్గా లేని ఏడుగురు సిట్టింగ్లకు సీట్లు ఇచ్చేందుకు నిరాకరించారు.
నరేంద్ర మోడీ, కేసీఆర్, రాహుల్ గాంధీని ఢీ కొట్టే శక్తి కేఏ పాల్ కే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కవితని ఈడీ అరెస్ట్ చేయకపోతే బీజేపీ 40 సీట్లు గెలుస్తుంది అని చెప్పాను.. ఇదంతా బీజేపీ, బీఆర్ఎస్ లోపాయకారి ఒప్పందం ఉందని పాల్ అన్నారు. కేసీఆర్ మంత్రి వర్గంలో ఉన్న చాలా మంది మంత్రులు నాతో టచ్ లో ఉన్నారు.