ఐపీఎల్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కర్ణాటక క్రికెటర్ కేసీ కరియప్ప.. ప్రస్తుతం తీవ్ర వివాదంలో ఇరుక్కున్నాడు. అతని మాజీ ప్రియురాలు అతనిపై తీవ్ర ఆరోపణలు చేసింది. కరియప్ప తన మాజీ ప్రియురాలు మాదకద్రవ్యాల వినియోగంలో ఉన్నట్లు ఆరోపించిన వీడియోను విడుదల చేయడంతో వివాదం సంచలనంగా మారింది. దీనిపై కర్ణాటక పోలీసులు విచారణ ప్రారంభించారు.