తెలుగు చిత్రసీమలో అనేక మంది జానపద కథానాయకులు ఉన్నా, ‘కత్తి’ అన్న మాటను ఇంటి పేరుగా మార్చుకున్న హీరో కాంతారావు అనే చెప్పాలి. ఈ నాటికీ ఆయనను ‘కత్తి’ కాంతారావు అనే ఎంతోమంది అభిమానంగా పిలుచుకుంటూ ఉంటారు. నటరత్న యన్.టి.రామారావు తరువాత అత్యధిక జానపద చిత్రాలలో కథానాయకునిగా నటించిన ఘనత కాంతారావు సొంతం. ఇక యన్టీఆర్ తరువాత శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రల్లోనూ నటించి అలరించారు కాంతారావు. అన్నిటినీ మించి నారద పాత్రలో కాంతారావు అభినయం నభూతో నభవిష్యతిగా…