ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి దౌర్జన్య ఘటనపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు.. బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు పెట్టాలిలని డిమాండ్ చేశారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి.. అధికారం శాశ్వతం కాదు, అధికారం మారిన తర్వాత పరిస్థితి గురించి ఆలోచించాలి.. అధికారం పోయిన తర్వాత, చేసిన వాటిని అనుభవించాల్సి వస్తుంది.. పోలీసు, రెవెన్యూ అధికారులు కూడా అలర్ట్ గా ఉండాలి, లేకపోతే ఇదే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు కాటసాని రాంభూపాల్…
సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుక మందమంటూ చంద్రబాబు గర్వంగా, అహంకారంగా వ్యవహరిస్తున్నారన్నారు. వైఎస్ఆర్సీపీ జిల్లాస్థాయి సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు. బాబుకు మోసం తప్ప చిత్తశుద్ధి తెలియదని విమర్శించారు. అక్రమ కేసులు పెట్టి బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
అమీన్‌పూర్‌లో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిపై కేసు నమోదైంది. అమీన్‌పూర్ వాణినగర్ చెరువులో అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో.. ఇవాళ కాటసానికి చెందిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చేసింది. మరోవైపు.. మల్లంపేట చెరువులో విల్లాలు నిర్మించిన విజయలక్ష్మిపై కూడా కేసు నమోదు అయింది. హైడ్రా కూల్చివేతలపై కాటసాని స్పందించారు. హైదరాబాద్లో హైడ్రా కూల్చిన బల్డింగ్కు తనకు సంబంధం లేదన్నారు.
Nandyala TDP Politics :ఒకరు ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే. ఇంకొకరు ఈసారి ఎమ్మెల్యే కావాల్సిందే అనుకుంటున్న ఓ మాజీ మంత్రి తనయుడు. ప్రత్యర్థులపై పోరుకంటే.. వాళ్లే పరస్పరం విమర్శించుకుంటున్నారట. మూడేళ్లుగా మిన్నకుండి.. ఎన్నికలు దగ్గర పడేకొద్దీ సొంతగూటిలో సౌండ్ పెంచుతున్నారట. ఇంతకీ అది ఏ నియోజకవర్గం? లెట్స్ వాచ్..!
టిడిపి నేత నారా లోకేష్ పై పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలని.. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే లోకేష్ కథ చూస్తామని హెచ్చరించారు. చేరుకులపాడు నారాయణరెడ్డి హత్య తరువాత వచ్చిన జగన్ ప్రజలను శాంతంగా వుండాలని చెప్పారని….లోకేశ్ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు వయసు అయిపోతుంది…ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని..తిట్టాలనుకుంటే మేము తిట్టగలం…మాకు ఆ సంస్కృతి లేదన్నారు. మంచి సంస్కారంతో జగన్ ను.. రాజశేఖర్ రెడ్డి…