Banaganapalli YSR Politics : ఆ ఎమ్మెల్యే ఇంట్లోనే రాజకీయ లుకలుకలు మొదలయ్యాయా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Banaganapalli YSR Politics : ఆ ఎమ్మెల్యే ఇంట్లోనే రాజకీయ లుకలుకలు మొదలయ్యాయా? రాజకీయంగా వేరు కుంపట్లు పెడుతున్నారా? అనుచరులు ఒక్కొక్కరుగా గుడ్‌బై చెప్పేస్తున్నారా? వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి?
కాటసాని రామిరెడ్డి. బనగానపల్లి ఎమ్మెల్యే. ఇక్కడ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో పీఆర్పీ నుంచి ఒకసారి.. 2019లో వైసీపీ నుంచి శాసనసభ్యుడయ్యారు రామిరెడ్డి. మరో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డికి తమ్ముడు. గతంలోనే ఇద్దరి మధ్య రాజకీయంగా విభేదాలు వచ్చాయి. ఒకరు కాంగ్రెస్‌లో మరొకరు టీడీపీలో ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరూ వైసీపీలోనే కొనసాగుతున్నా.. రామిరెడ్డి కుటుంబంలో ఇప్పుడు లుకలుకలు మొదలయ్యాయి.
Also Read
రామిరెడ్డి అన్న కుమారుడు కాటసాని రమాకాంత్ రెడ్డి అవుకు మండలం గుండ్ల సింగవరం సర్పంచ్ గా వున్నారు. ఈ మధ్య రమాకాంత్ రెడ్డి ఫేస్‌బుక్‌లో ఓ పోస్టింగ్ పెట్టారు. వైసీపీ కి గుడ్ బై…. సారి సీఎం జగన్ అంటూ ఆయన కామెంట్స్ చేశారు. త్వరలో మరో పార్టీలో చేరేందుకు నిర్ణయించారట. త్వరలోనే మద్దతుదారులతో సమావేశం ఏర్పాటు చేసి ప్రకటన చేస్తారట. గుర్తింపు ఉన్న మరో పార్టీలో చేరితే తన వాణి బాగా వినిపించవచ్చనే నిర్ణయానికి వచ్చారట రమాకాంతరెడ్డి. కాటసాని కుటుంబంలో గొర్లగుట్ట వద్ద ఏడుగురిని ఒకేసారి హత్య చేసిన తర్వాత.. రమాకాంత్ రెడ్డి తండ్రి కాటసాని శివరామిరెడ్డి బాధ్యతలు భుజాన వేసుకొని ఫ్యాక్షన్ గొడవలకు బలయ్యారు. ఇపుడు తనకు రాజకీయ ఎదుగుదల లేకుండా చేశారనే అసంతృప్తిలో రమాకాంత్ రెడ్డి ఉన్నారట. కాటసాని రామిరెడ్డి ప్రస్తుతం తన కుమారుడు ఓబులరెడ్డిని ప్రోజెక్ట్ చేస్తున్నారని, ఇలాగైతే తాము ఎప్పుడు ఎదుగుతామనే అభిప్రాయంతో ఉన్నారట.
కాటసాని రామిరెడ్డి ముఖ్య అనుచరుడు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఉన్న కాట్రేడ్డి మల్లికార్జున రెడ్డి కూడా వైసీపీ కి గుడ్‌బై చెప్పేసారు. గతంలో మల్లికార్జున రెడ్డి తండ్రి టీడీపీలో వున్నారు. కాటసాని రామిరెడ్డి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన తరువాత మల్లికార్జున రెడ్డి ఇటొచ్చారు. చాలా కాలంగా రామిరెడ్డితో ఉన్నప్పటికీ ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదనే అసంతృప్తితో ఉన్నారట. సొంత కుటుంబ సభ్యులకు ప్రయారిటీ ఇస్తూ.. తనకంటే జూనియర్లకు పదవులు కట్టబెడుతున్నారని.. అలాంటప్పుడు వైసీపీలో ఎందుకు ఉండాలని ప్రశ్నిస్తూ వెళ్లిపోయారట. కాట్రేడ్డి మల్లికార్జున రెడ్డి మాజీ ఎమ్మెల్యే బిసి జనార్దన్ రెడ్డి , నారా లోకేష్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు.
రమాకాంత్ రెడ్డి వైసీపీ నుంచి బయటికి వెళ్లకుండా కుటుంబ సభ్యుల ద్వారా ఎమ్మెల్యే రామిరెడ్డి మంతనాలు చేస్తున్నారట. కానీ రమాకాంత్‌రెడ్డి ఒప్పుకోవడం లేదట. మొత్తానికి వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు దూరం కావడం హాట్ టాపిక్ అయింది. మరి.. పార్టీ పెద్దలు సమస్య గుర్తించి నష్ట నివారణ చర్యలు చేపడతారో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!