Kasu Mahesh Reddy: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి నేతలు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. తాజాగా, తెలుగుదేశం పార్టీ నేతలను ఉద్దేశిస్తూ.. వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. గతంలో కర్ర పట్టుకుని వచ్చే వాళ్లు.. రేపు గొడ్డలితో వస్తారన్నారు గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి.. మాచవరంలో బాబు షూరిటీ – మోసం గ్యారెంటీ కార్యక్రమంలో ఈ హాట్ కామెంట్స్ చేశారు.
Read Also: Indian Navy Submarines: అణు సబ్‌మెరిన్ల దిశగా భారత నౌకాదళం.. మరో 9 కొత్త సబ్‌మెరిన్లు?
టీడీపీ నాయకుల వేధింపులతో ఇప్పుడు ఊర్లు వదిలిపెట్టి వెళ్లినవారు.. మళ్లీ తిరిగి వస్తారని తెలిపారు కాసు.. మీరు గ్రామం దాటించారని.. రేపు రాష్ట్రం దాటి వెళ్లే పరిస్థితి వస్తుందంటూ వార్నింగ్ ఇచ్చారు.. తెగించే వరకూ తీసుకెళ్తున్నారని వ్యాఖ్యానించిన ఆయన.. వైసీపీ నాయకులు తెగిస్తే టీడీపీ తట్టుకోలేరని హెచ్చరించారు.. వీధి వీధిలో పరుగెత్తించి తంతారంటూ సీరియస్ కామెంట్లు చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి.. ఇక, పార్టీకి సంబంధించిన అన్ని కమిటీలు పూర్తి చేయాలి.. అన్ని సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.. గతంలోనూ పార్టీ కమిటీల్లో అందరికీ ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు.. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.. రుణమాఫీ పూర్తిస్థాయిలో చేస్తానని చేయకుండానే ముగించారని విమర్శించారు.. ఇక, ప్రస్తుతం కూడా సాధ్యంకానీ హామీలు ఇచ్చి తూతూమంత్రంగా చేస్తున్నారని మండిపడ్డారు.. ఇక, వైసీపీ నాయకులపై కూటమి నాయకులు లేని పోని అక్రమ కేసులు పెడుతున్నారు అంటూ ఫైర్ అయ్యారు కాసు మహేష్ రెడ్డి..