Abhishek Agarwal comments on national awards: ‘ది కశ్మీర్ ఫైల్స్’కు రెండు జాతీయ అవార్డులు రావడం చాలా అనందంగా ఉందని, ఇది ప్రజల సినిమా అని దేశ ప్రజలే ఈ అవార్డులు గెలుచుకున్నారని చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ పేర్కొన్నారు. ‘69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం రెండు అవార్డులు సొంతం చేసుకుంది. ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం, అలాగే ఉత్తమ సహాయనటిగా పల్లవి జోషి అవార్డులు కైవసం చేసుకున్న…
జమ్ముకశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో హిందూమతమే ఇస్లాం కంటే అతి పురాతనమైనదని తెలిపారు. ఈ దేశంలో పుట్టిన వారంతా తొలుత హిందువులేనని కీలక వ్యాఖ్యలు చేశారాయన.
జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదం సజీవంగా ఉందని, పాకిస్థాన్‌తో చర్చలు జరపడం ద్వారానే దాన్ని అంతం చేయగలమని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు.
జమ్మూ కాశ్మీర్ లో టార్గెటెడ్ కిల్లింగ్స్ కలకలం రేపుతున్నాయి. వరసగా కొన్ని రోజులుగా ఉగ్రవాదులు అమాయకమైన హిందువులను, ముస్లింలను చంపుతున్నారు. గురువారం కాశ్మీర్ కుల్గాంలో బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ ను కాల్చి చంపారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే మరో ఇద్దరు వలస కార్మికులను చంపేశారు. దీంతో లోయ నుంచి కాశ్మీరి పండిట్లు పెద్ద సంఖ్యలో వలస వెళ్లేందుకు నిర్ణయించుకుంటున్నారు. ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్ లో టార్గెట్ కిల్లింగ్స్ పై కేంద్ర హోంశాఖ మంత్రి…
జమ్మూ కాశ్మీర్ లో గురువారం ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. ప్రభుత్వం ఉద్యోగి అయిన కాశ్మీరీ పండిట్ రాహుల్ భట్ ను కార్యాలయంలోనే హత్య చేశారు. బుద్గాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చాదూరా పట్టణంలోని తహసీల్ కార్యాలయంలో అక్కడ క్లర్క్ గా పనిచేస్తున్న రాహుల్ భట్ ను దగ్గర నుంచి షూట్ చేశారు. ఉగ్రవాదాలు రాహుల్ భట్ ఎవరని ఆరా తీస్తూ… కాల్పులు జరిపారు. తాజాగా శుక్రవారం రాహుల్ భట్ అంత్యక్రియలు జరిగాయి. కాశ్మీర్ లోని పండిట్లు పెద్ద…