కాంగ్రెస్ పార్టీ తనను తాను సంస్కరించుకోవాలని చూస్తోంది. దీనికి రాజస్తాన్ ఉదయ్ పూర్ లో జరుగుతున్న ‘ నవ కల్పన్ శింతన్ శిబిర్’ వేదిక కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉదయ్ పూర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ‘ ఒక కుటుంబం- ఒక సీటు’ నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ తనపై ఉన్న కుటుంబ పార్టీ ముద్రను తొలగించుకోవాలని అనుకుంటోంది. దీంతో పాటు పార్టీలో పనిచేసే వారికి మాత్రమే పదవులు, టికెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.…