Karthika Pournami: కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
Suryalanka Beach Closed: ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుఫాన్ విధ్వంసం సృష్టించింది.. రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చింది.. అయితే, కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రతి సంవత్సరం వేలాదిమంది భక్తులు సముద్ర స్నానాల కోసం బాపట్ల సూర్యలంక బీచ్‌కు తరలివచ్చే దృశ్యం ఈసారి కనిపించలేదు. మొంథా తుపాన్ ప్రభావంతో సముద్రంలో ప్రమాదకర గోతులు ఏర్పడటంతో అధికారులు ముందస్తు చర్యగా బీచ్‌ను మూసివేశారు. సాధారణంగా ఈ పుణ్యక్షేత్ర కాలంలో రెండు లక్షల మందికి పైగా భక్తులు సూర్యలంక సముద్రతీరంలో పుణ్యస్నానం ఆచరిస్తుంటారు.…
Srisailam: కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు శ్రీశైలం చేరుకుని, పాతాళగంగలో పవిత్ర స్నానాలు ఆచరించారు. కార్తీక పౌర్ణమి పుణ్యస్నానం ఎంతో పవిత్రమని నమ్మే భక్తులు గంగా దేవిని స్మరిస్తూ పుణ్యస్నానంలో పాల్గొన్నారు. గంగాధర మండపం, ఉత్తర మాడవీధి, ఈశాన్య వీధుల్లో భక్తులు వేలాది దీపాలను వెలిగించి భక్తి శ్రద్ధలతో మల్లన్నను ప్రార్థించారు. సాయంత్రం సమయానికి దీపాలతో కాంతులీనిన శ్రీశైలం…
హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక పౌర్ణమి 2025 వచ్చేసింది. కార్తీక మాసం శుక్ల పక్షంలో వచ్చే పౌర్ణమి తిథినే కార్తీక పౌర్ణమి లేదా కార్తీక శుద్ధ పౌర్ణమి గా పిలుస్తారు. ఈ సంవత్సరం (2025) కార్తిక పౌర్ణమి నవంబర్ 5 బుధవారం జరగనుంది. పంచాంగ గణిత ప్రకారం ఆ రోజు సాయంత్రం 6.35 వరకు పౌర్ణిమ తిథి ఉంటుంది. దేశవ్యాప్తంగా అన్ని శైవక్షేత్రాల్లో, వైష్ణవ దేవాలయాల్లో భక్తి వాతావరణం నెలకొంది. ఇది హిందూ సంప్రదాయంలో అత్యంత…