Takker Trailer: హీరో సిద్దార్థ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బొమ్మరిల్లు సినిమాతో బొమ్మరిల్లు సిద్దార్థ్ గా మారిపోయాడు. తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో నటిస్తూ మెప్పించిన సిద్దూ.. గత కొంతకాలంగా తెలుగుకు దూరమయ్యాడు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుండి మే నెలలో రెండు సినిమాలు జనం ముందుకు రాబోతున్నాయి. గోపీచంద్ మూవీ 'రామబాణం' మే 5న, సిద్ధార్థ్ నటించిన 'టక్కర్' మే 26న రిలీజ్ అవుతున్నాయి.
సిద్ధార్థ్ నటించిన తాజా చిత్రం 'టక్కర్' టీజర్ ను అతని బర్త్ డే సందర్భంగా విడుదల చేశారు. 'మజిలీ' ఫేమ్ దివ్యాంశ కౌశిక్ ఈ లవ్ అండ్ యాక్షన్ డ్రామాలో హీరోయిన్ గా నటించింది.