Siddarth: అప్పుడెప్పుడో హీరో సిద్ధార్థ్ లైఫ్ లైన్ స్ట్రక్ అయినట్టుంది. కొన్నేళ్ళుగా అతను అమృతం తాగిన మనిషిలా ఒకే ఏజ్ లో కనిపిస్తున్నాడు. ఫేస్ లో ఛార్మ్ కాస్తంత తగ్గినా… ఆ ఫిజిక్ ను మాత్రం చక్కగా మెయిన్ టైన్ చేస్తున్నాడు. తాజాగా సిద్ధార్థ్ నటిస్తున్న ‘టక్కర్’ మూవీ టీజర్ ను అతని బర్త్ డే కానుకగా మేకర్స్ విడుదల చేశారు. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా రూపుదిద్దుకుంది.
శర్వానంద్ తో కలిసి ‘మహా సముద్రం’ మూవీ తర్వాత తెలుగులో వస్తున్న సిద్ధార్థ్ చిత్రమిది. కార్తిక్ జి క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ‘మజిలీ’ ఫేమ్ దివ్యాంశ్ కౌశిక్ హీరోయిన్ గా నటించింది. గత యేడాది ఆమె రవితేజ సరసన చేసిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ పరాజయం పాలైంది. అలానే ఈ యేడాది వచ్చిన సందీప్ కిషన్ ‘మైఖేల్’ సైతం అమ్మడికి విజయాన్ని అందించలేదు. బహుశా అందుకే కావచ్చు… ఈ ‘టక్కర్ ‘మూవీలో బాగా డబ్బున్న టక్కరి పాత్రను దివ్యాంశ కాస్తంత రొమాంటిక్ అండ్ సెక్సీగా చేసేసింది. లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ‘టక్కర్’ మూవీ టీజర్ చూస్తుంటే… సమ్ థింగ్ డిఫరెంట్ అనిపిస్తోంది. నివాస్ కె ప్రసన్న సంగీతం అందించిన ఈ సినిమాలో అభిమన్యు సింగ్, యోగిబాబు, మునీశ్ కాంత్, ఆర్జే విఘ్నేష్ కాంత్ కీలక పాత్రలు పోషించారు. అభిషేక్ అగర్వాల్, టీ.జీ. విశ్వప్రసాద్… పేషన్ స్టూడియోస్ తో కలిసి మే 26న ‘టక్కర్ ‘ను తెలుగు వారి ముందుకు తీసుకు రాబోతున్నారు. మరి ఈ సినిమాతో అయినా సిద్ధార్థ్, దివ్యాంశ లకు సక్సెస్ దక్కుతుందేమో చూడాలి.