Takkar Trailer: హీరో సిద్దార్థ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బొమ్మరిల్లు సినిమాతో బొమ్మరిల్లు సిద్దార్థ్ గా మారిపోయాడు. తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో నటిస్తూ మెప్పించిన సిద్దూ.. గత కొంతకాలంగా తెలుగుకు దూరమయ్యాడు. ఇక ఇప్పుడు మరోసారి తెలుగు ప్రేక్షకుల మనసు గెలవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన మహా సముద్రం సినిమాతో తెలుగు రీఎంట్రీ ఇచ్చాడు సిద్దూ.. అయితే ఆ సినిమా మనోడికి పెద్ద ప్లాప్ ను అందించింది. ఇక ఈసారి టక్కర్ అంటూ ప్రేక్షకులను అలరించబోతున్నాడు. తెలుగులో ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి. కార్తీక్ జి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిద్దూ సరసన మజిలీ బ్యూటీ దివ్యాంశ కౌశిక్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు.
బాలకృష్ణ కూతుర్లను చూశారా.. హీరోయిన్లు కూడా దిగదుడుపే వీరి ముందు
ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ఆద్యంతం ఆకట్టుకొంటుంది. ” ఆశే ఈ లోకాన్ని నడిపిస్తుంది.. అదే ఆశ మన లైఫ్ ను నిర్ణయిస్తుంది. ఆ ఆశను నెరవేర్చుకోవడానికి ధనమే ఇంధనం.. దాన్ని సంపాదించుకోవడానికి ఒక్కొక్కరిది ఒక్కో దారి.. ఆ దారి అందరికి ఒక్కటి అయినప్పుడు” అన్ని సిద్దార్థ్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమయ్యింది. పేద కుటుంబంలో పుట్టి డబ్బు కోసం ఎలాంటి టక్కర్ పనులైన చేయడానికి సిద్దపడే హీరోకు.. బాగా డబ్బున్న హీరోయిన్ పరిచయమవుతుంది. ఆమె కేవలం సంతోషం కావాలని చెప్పడంతో.. ఆమె దగ్గర ఉన్న నగలను అమ్మి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఇంతలోనే హీరోయిన్ ను కిడ్నాప్ చేస్తే రూ. 50 లక్షలు ఇస్తామని చెప్పడంతో ప్రేమించిన అమ్మాయిని సైతం కిడ్నాప్ చేస్తాడు హీరో.. ఆ తరువాత వారు ఎదుర్కున్న పరిస్థితిలు ఏంటి ..? అసలు ఆ హీరోయిన్ ను ఎందుకు కిడ్నాప్ చేశారు..? చివరికి హీరో ఆశ నెరవేరిందా..? లేదా అనేది కథగా తెలుస్తోంది. ఇక సిద్దు న్యూ లుక్ ఆకట్టుకొంటుంది. ముఖ్యంగా సిద్దూ, దివ్యాంశ ల మధ్య రొమాంటిక్ సీన్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. యోగిబాబు కామెడీ హైలైట్ అని చెప్పొచ్చు. జూన్ 9 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో సిద్దార్థ్ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తాడా..? లేదా..? అనేది చూడాలి.