ఖైరతాబాద్ వినాయకుడు వద్ద కర్ర పనులు స్పీడ్ అందుకున్నాయి. రేపు ఉదయం 7గంటలకు శోభాయాత్ర ప్రారంభించాలనే ఉద్దేశంతో పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈరోజు 9 గంటలకు మహా హారతి కార్యక్రమం ఉంటుంది.. అనంతరం 11.30 గంటలకు కలశం పూజ నిర్వహిస్తారు.. రేపు మంగళవారం కావడంతో సోమవారం రోజులో ఉండగానే మహా గణపతిని కదిలిస్తారు. 12 గంటల తరువాత మహా గణపతిని టస్కర్ పైకి ఎక్కిస్తారు.