కర్ణాటకలో ప్రస్తుతం లాక్డౌన్ కోనసాగుతోంది. ఈరోజు నుంచి మే 24 వరకు లాక్డౌన్ అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని దేవసుగుర్ చెక్పోస్ట్ దగ్గర కర్ణాటక పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైద్యం,నిత్యవసర సరుకుల వాహనాలను మాత్రమే కర్ణాటకలోకి అనుమతిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కర్ణాటకలో రోజువారి కరోనా కేసులు 40 వేలకు పైగా నమోదవుతుండటంతో రెండు వారాలపాటు సంపూర్ణలాక్డౌన్ను అమలు చేస్తున్నారు. లాక్ డౌన్…
దేశంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇక దక్షిణభారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో పరిస్థతి వేరుగా ఉన్నది. రోజుకు 50వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్క బెంగళూరు నగరంలోనే ఏకంగా 25 వేలకు పైగా కేసులు, 200 లకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్ విధించాలని, లేదంటే కర్ణాటక రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు పెనుముప్పు వాటిల్లే అవకాశం ఉంటుందని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ తెలియజేసింది.…
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో వెలుగుచూసిన ఎన్ 440 కె వేరియంట్ రాష్ట్రంలో వేగంగా విస్తరించింది. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవ్వడానికి ఈ వేరియంట్ కారణం అని అంటున్నారు. ఈ వేరియంట్ ఇప్పుడు ఏపీతో పాటుగా పొరుగురాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో వెలుగుచూస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఎన్ 440 కె వేరియంట్ అధికంగా విస్తరిస్తున్నట్టు నిపుణులు చెప్తున్నారు. ఈ వేరియంట్ వ్యాప్తి 15 శాతం వేగంగా విస్తరిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలని,…
దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. దక్షిణాదిన ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే కర్ణాటక రాష్ట్రంలో ఏకంగా 50 వేలకు పైగా కేసుకు నమోదయ్యాయి. ఆంక్షలు, మినీ లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ, లాక్ డౌన్ వంటివి విధించినా కరోనా ఏ మాత్రం కట్టడి కావడం లేదు. కేసులతో పాటుగా అటు మరణాల సంఖ్యా కూడా పెరుగుతున్నది. రాజధాని బెంగళూరులో కేసులు నిన్న ఒక్కరోజు 23 వేలకు…
కర్ణాకటపై కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతోంది.. పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి.. ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 23,558 కొత్త కేసులను నమోదు అయ్యాయి.. కర్ణాటకలో ఒకేరోజు ఇంత భారీస్థాయిలో కొత్త కేసులు వెలుగు చూడడం ఇదే తొలిసారి.. కోవిడ్ బారిన పడి 116 మంది మృతిచెందగా.. ఇదే సమయంలో 6,412 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. పాజిటివ్…
ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో కుంభమేళా జరుగుతున్నది. మాములుగా ఈ కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలివస్తారు. దేశంలోని నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా లక్షల మంది ఈ కుంభమేళాకు తరలివస్తుంటారు. కరోనా సమయంలో జరుగుతున్న కుంభమేళా కావడంతో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా మహమ్మారి కుంభమేళాలో వ్యాపిస్తోంది. ఇప్పటికే అనేకమంది కుంభమేళాకు వచ్చిన భక్తులు కరోనా బారిన పడ్డారు. దీంతో కర్ణాటక ప్రభుత్వం కుంభమేళాపై కీలక నిర్ణయం తీసుకుంది. కుంభమేళాకు వెళ్లి…
మాములుగా మనకు ప్రమోషన్స్ కావాలంటే బాస్ ను కాకాపడతారు. రాజకీయంగా ఎదుగుదల కావాలంటే పైస్థాయిలో ఉండే నేతలను, మంత్రులను కాకాపడుతుంటాం. మంత్రి పదవులు కావాలంటే అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవాలి. అయితే, ఓ మంత్రికి డెప్యూటీ సీఎం కావాలనే కోరిక బలంగా ఉన్నది. ఆ విషయాన్ని అధిష్టానం ముందుకు తీసుకెళ్లకుండా డైరెక్ట్ గా భగవంతుడిని ముందుకు తీసుకెళ్లాడు. దీంతో ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది. కర్ణాటక మంత్రి బి శ్రీరాములు నిన్నటి రోజున కలబుర్గి లోని దుర్గాదేవి దేవాలయాన్ని సందర్శించారు. తన మనసులోని…