కర్ణాటకలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు పెరుగున్న సమయంలో కట్టడికి సంపూర్ణ లాక్‌డౌన్ ఒక్కటే పరిష్కరమని నిపుణులు హెచ్చరించడంతో కర్ణాటక సర్కార్ లాక్‌డౌన్‌ను విధించింది. నిన్నటి రోజున కర్ణాటకలో 47 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. బెంగళూరు అర్బన్ ప్రాంతంలో ఏకంగా 20 వేలకు పైగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. కరోనా కేసులతో పాటుగా అటు మరణాల సంఖ్యకూడా బెంగళూరు నగరంలో పెరిగిపోతున్నది. మే 17 నాటికి కరోనా కేసులు అత్యధిక స్థాయికి చేరుకుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక జూన్ 11 నాటికి బెంగళూరులో కరోనా కరోనా మరణాలు 14 వేలకు పైగా నమోదవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొదట ఈ సంఖ్య 26 వేలకు పైగా ఉంటుందని అంచనా వేసినా, లాక్‌డౌన్ అమలు చేస్తున్నందువల్ల ఈ సంఖ్య 14వేలకు పడిపోవచ్చని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పేర్కొన్నది.