కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించింది కర్ణాటక ప్రభుత్వం.. ప్రస్తుత లాక్‌డౌన్ గడువు ఈనెల 24తో ముగియనుండగా.. జూన్ 7వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం యడ్యూరప్ప ప్రకటించారు.. రాష్ట్రంలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ కేసులు వ్యాపించిన నేపథ్యంలో మరో 14 రోజులు లాక్‌డౌన్ పొడిగించినట్టు వెల్లడించారు. మంత్రులు, అధికారులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించిన సీఎం.. ఆ తర్వాత లాక్‌డౌన్‌పై ప్రకటన చేశారు.. ఈ సమయంలో ఉదయం 6 నుండి ఉదయం 10 గంటల వరకు ప్రజలకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి అనుమతిస్తామని తెలిపారు.. లాక్‌డౌన్ రాష్ట్రవ్యాప్తంగా ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక, బ్లాక్ ఫంగస్‌కు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగానే చికిత్స అందిస్తామని స్పష్టం చేశారు.