కర్ణాటకలో ప్రస్తుతం ‘పవర్ షేరింగ్’ వివాదం నడుస్తోంది. మొన్నటిదాకా హస్తిన వేదికగా చర్చలు నడవగా.. ప్రస్తుతం బెంగళూరులో బ్రేక్‌ఫాస్ట్ రాజకీయాలు నడుస్తున్నాయి. గత శనివారం సిద్ధరామయ్య ఇంట్లో డీకే.శివకుమార్ అల్పాహారం తీసుకోగా.. మంగళవారం డీకే.శివకుమార్ ఇంట్లో సిద్ధరామయ్య బ్రేక్‌ఫాస్ట్ చేశారు.
కర్ణాటకలో ప్రస్తుతం బ్రేక్‌ఫాస్ట్ రాజకీయాలు నడుస్తున్నాయి. ‘‘నీ ఇంటికి నేనొస్తా.. నా ఇంటికి నువ్వు.. రా!’’ అన్నట్టుగా సిద్ధరామయ్య-డీకే.శివకుమార్ మధ్య పాలిటిక్స్ సాగుతున్నాయి. బ్రేక్‌ఫాస్టేనా? ఇంకేమైనా? ఉందా? అన్నది మాత్రం తేలడం లేదు.
CM Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మత మార్పిడులపై చేసిన వ్యాఖ్యలతో రాజకీయ వివాదం చెలరేగింది. హిందూ సమాజంలో సమానత్వం ఉంటే, ఎవరైనా ఎందుకు మతం మారుతారు? అని ఆయన అన్నారు. సమానత్వం ఉంటే, అంటరానితనం ఎందుకు వచ్చింది? మనం అంటరానితనాన్ని సృష్టించామా? అని ప్రశ్నించారు. ఇస్లాం, క్రైస్తవ మతం లేదా ఏ మతంలోనైనా అసమానతలు ఉండవచ్చని.. తాము లేదా బీజేపీ ఎవరినీ మతం మారమని అడగలేదన్నారు. కానీ ప్రజలు మతం మారుతున్నారని.. అది వారి హక్కు…
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను మెటా సంస్థ చంపేసింది. ఇటీవల ప్రముఖ నటి సరోజా దేవి కన్నుమూశారు. ఆమె మృతికి సంతాపం తెల్పుతూ సిద్ధరామయ్య కన్నడలో ఒక పోస్ట్ పెట్టారు.
CM Siddaramaiah : ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌పై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన వైఖరిని స్పష్టం చేశారు.
Karnataka : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం బీజేపీపై పెద్ద ఆరోపణ చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ 50 మంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఆఫర్ చేసిందని సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు.
తుంగభద్ర గేటు మరమ్మతు పనులు వేగంగా సాగుతున్నాయి. గల్లంతైన తుంగభద్ర డ్యామ్ 19వ గేటు స్థానంలో స్టాప్ లాగ్ ఏర్పాటుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. నీరు పూర్తిగా వృథాకాక ముందే స్టాప్‌లాగ్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు తుంగభద్ర బోర్డు, కర్ణాటక, ఏపీ అధికారులు.
Prajwal Revanna : జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ డిప్లమాటిక్ పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.
Siddaramaiah : కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పెద్ద ఆరోపణ చేశారు. కర్ణాటకలో కరువు సాయంగా కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు.
కర్ణాటక అసెంబ్లీ సమావేశంలో సీఎం సిద్దరామయ్య మాట్లాడిన వీడియో అంటూ ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్నికల్లో ఓట్ల కోసం అది ఇస్తాం.. ఇది ఇస్తాం అంటాం. అంత మాత్రాన అన్నీ ఫ్రీ గా ఇవ్వాలా? మాకు ఇవ్వాలనే ఉంది. కానీ అయితే డబ్బులు లేవు’ అంటూ ఆయన వ్యాఖ్యానించినట్టుగా ఉన్న వీడియో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ షేర్ చేస్తూ సటైర్లు విసిరారు. తెలంగాణ భవిష్యత్తు కూడా ఇంతేనా? అంటూ కౌంటర్…