Karimnagar: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులను అసభ్యకరంగా తాకుతూ, బాత్‌రూముల్లో కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తూ ఏడాదిగా వేధింపులకు గురి చేస్తున్న కీచక అటెండర్ యాకుబ్ పాషా బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ‘‘కురిక్యాల’’లో చోటు చేసుకుంది. ఈ అంశంపై జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. సఖి కౌన్సిలింగ్ నిర్వాహకుల ద్వారా యాకుబ్ పాషా దారుణాలను కలెక్టర్ తెలుసుకున్నారు.
Crypto Scam : క్రిప్టోకరెన్సీ, బిట్‌కాయిన్ పేర్లతో కోట్ల రూపాయల మోసం చేసిన మెటాఫండ్ కింగ్ పిన్ వరాల లోకేశ్వర్‌రావును కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వివరాలను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలం మీడియాకు వెల్లడించారు. కరీంనగర్ కు చెందిన తులసీ ప్రకాష్ తో స్నేహం ఏర్పడిన తర్వాత 2024లో ఈ మోసం ప్రారంభమైంది. మెటాఫండ్, యూబిట్ పేర్లతో నకిలీ యాప్‌లు సృష్టించి, పెట్టుబడిదారులను మోసం చేశారు. ఒక్కొక్క వ్యక్తికి 90,000 రూపాయలకు 1,000…
Tragedy : కరీంనగర్ జిల్లాలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న హత్యకేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. మొదట అనుమానాస్పద మరణం కేసుగా నమోదు చేసిన ఈ ఘటనను, పూర్తి దర్యాప్తు తర్వాత భార్య సహా ఆరుగురి కుట్ర ద్వారా జరిగిందని తేల్చారు. కరీంనగర్ లోని సప్తగిరి కాలనీకి చెందిన ప్రైవేట్ డ్రైవర్ కత్తి సురేష్, 2015లో మౌనికను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మౌనిక డబ్బుల కోసం పడుపు వృత్తిని…
Karimnagar Loan Scam: అప్పు పుట్టాలంటే.. ఆస్తులు తాకట్టు పెట్టాలి. అంతే కాదు.. బ్యాంకులు అడిగిన అన్ని డాక్యుమెంట్లు సమర్పించాలి. లక్షల్లో లోన్ కావాలంటే సవాలక్ష ప్రశ్నలు అడుగుతారు. దీంతో బ్యాంకుల చుట్టూ లోన్స్ కోసం తిరిగే వారు.. ఆయా అధికారులు చెప్పే కండీషన్స్ ఫుల్ ఫిల్ చేయలేక.. తర్వాత రుణాలు రాక.. ఏదైనా పని చేసుకుందామంటే చేతిలో డబ్బులు లేక దిక్కులు చూస్తుంటారు. సరిగ్గా అలాంటి వాళ్లను టార్గెట్ చేశాడు దోమల రమేష్ అనే వ్యక్తి.…
Karimnagar Crime: అప్పుల బాధ భరించలేక ఓ రైతు మృతిచెందాడు. యాజమాని మాటి మాటి కౌలు రైతును వేధించడం వలన ఆవేదన చెందిన రైతు అనారోగ్యానికి గురై చివరకు ప్రాణాలు కోల్పోయాడు.
ఆడపిల్ల అంటే ఇంటికి మహాలక్ష్మి అని పెద్దలు అంటుంటారు. కానీ అమ్మాయి అంటే సమాజంలో ఇప్పటికీ ఓ చిన్నచూపే ! మగ పిల్లాడు పుడితే సంబురాలు చేసుకుంటూ.. ఆడపిల్ల పుడితే భారంగా భావించే వాళ్లు చాలామందే ఉన్నారు.
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామంలోఅట్టికం శంకరయ్య అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతనికి అట్టికం రవికుమార్ అనే కొడుకు ఉన్నాడు. అయితే వీరి మధ్య తరచూ ఆస్తి కోసం రోజూ తండ్రిపై కొడుకు గొడవకు దిగేవాడు.
ప్రజలను మోసం చేసేందుకు సైబర్ కేటుగాళ్ల టెలిగ్రామ్ యాప్ అడ్డాగా ఎంచుకున్నారు. నాలుగురోజుల్లో హైదరాబాద్ .. నగరానికి చెందిన ముగ్గురిని ట్రాప్ చేసి కోటిన్నరదాకా కాజేశారు. యూట్యూబ్ వీడియోస్ యాడ్స్ క్లిక్ చేస్తే లక్షల్లో కమీషన్ అంటూ ఎరవేస్తూ లక్షలు కాజేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో చిన్నారులపై కుక్కల దాడులు హడలెత్తుస్తున్నాయి. నిన్న అంబర్ పేట్ పోలీస్టేషన్ పరిధిలో చిన్నారిపై కుక్కలు దాడి చేసి చంపేసిన ఘటన మరువక ముందే మరో ఇద్దరు చిన్నారులపై కుక్కలదాడి భయాందోళన కలిగిస్తుంది.