Cyber Thieves: టెలిగ్రామ్ యాప్, డేటాఫ్ బర్త్ పేరిట మోసం.. కోట్లు కొట్టేస్తున్న సైబర్ కేటుగాళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Thieves: రోజు రోజుకు సైబర్ నేరగాళ్లు కొత్తతరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఒక దానిపై ప్రజలు తెలుసుకునే లోపే మరొక సైబర్ నేరానికి తెర లేపుతున్నారు. ఈకాలంలో ఆన్‌లైన్ పేమెంట్లు, షాపింగ్ పెరిగుతుండటంతో.. మోసాలు కూడా అదే రేంజ్‌లో పెరుగుతున్నాయి. దీంతో..ఇక సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతున్నారు. ఎక్కడా లేని విధంగా.. ఎవరూ ఊహించని రీతిలో మోసాలకు పాల్పడుతున్నారు. ఇక జనాలను మోసం చేయడానికి సైబర్ మోసగాళ్లు ఎలాంటి మార్గం వదలిపెట్టడం లేదు. అయితే దీనిపై పోలీసులు సైబర్ నేరాల గురించి ఎంత అవగాహన కల్పించినా సరే.. ఏదో రకమైన మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు ఒకరకమైన నేరాల గురించి అవగాహన కల్పించేలోపే మరో రకమైన మోసాలకు వెలుగులోకి వస్తున్నారు.
Read also: Medico Preethi: ప్రీతి ఫోన్ చాటింగ్ తో పాటు కొన్ని కీలక ఆధారాలు.. కస్టడిలో సైఫ్
Also Read
- KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
ప్రజలను మోసం చేసేందుకు సైబర్ కేటుగాళ్ల టెలిగ్రామ్ యాప్ అడ్డాగా ఎంచుకున్నారు. నాలుగురోజుల్లో హైదరాబాద్ .. నగరానికి చెందిన ముగ్గురిని ట్రాప్ చేసి కోటిన్నరదాకా కాజేశారు. యూట్యూబ్ వీడియోస్ యాడ్స్ క్లిక్ చేస్తే లక్షల్లో కమీషన్ అంటూ ఎరవేస్తూ లక్షలు కాజేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఇద్దరి నుండి కోటికి పైగా సైబర్ ఫ్రాడ్ చేశారు. ఇక తాజాగా రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగిని ట్రాప్ చేసి ఇరవై లక్షలకు పైగా కొట్టేయడం సంచలనంగా మారింది. అందమైన యువతుల డీపీలు పెట్టి యూజర్స్ ను చీటీర్స్ ట్రాప్ చేస్తున్నారు. టెలిగ్రామ్ లో ఫోన్ నెంబర్ హైడ్ ఆప్షన్ ను అనుకూలంగా మార్చుకుని మోసాలకు పాల్పడుతున్నారు. అందిన కాడికి కాజేసి తర్వాత టెలిగ్రామ్ లో అకౌంట్ డిలీట్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. రంగంలోకి దిగిన పోలీసులు సబైర్ నేరస్తులను పట్టుకునే పనిలో పడ్డారు. సైబర్ నేరస్తుల చేతిలో డబ్బులను పోగొట్టుకుని లబోదిబో మంటున్నారు. న్యాయం చేయండి అంటూ పోలీస్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు.
Read also: Ram Gopal Varma: కేటీఆర్ సార్.. మేయర్ ఇంట్లోకి వీధికుక్కలను వదలండి.. ఆర్జీవీ వీడియో వైరల్..
ఇక ఇలాంటి తరహాలోనే మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా డేటాఫ్ బర్త్ పేరిట సైబర్ మోసానికి పాల్పడుతూ అమాయక జనాన్ని ఆడేపుకుంటున్నారు. సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన సుభాష్ రావు కు చెందిన క్రెడిట్ కార్డులో డేటాఫ్ బర్త్ తప్పుగా ఉందని సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. డేటాఫ్ బర్త్ సరిచేయాలని నమ్మ బలికాలు. దీంతో సుభాష్ రావు మొబైల్ లో ఓయాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలని సూచించిన సైబర్ నేరగాళ్లు. అయితే.. నిజమని నమ్మిన సుభాష్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నాడు. అంతే ఒక్కనిమిషంలోనే అతని ఖాతాలో వున్న 1,06,910 లక్ష రూపాయలు అకౌంట్ నుంచి డెబిట్ అయినట్లుగా మొబైల్ కు మెసేజ్ రావడంతో సుభాష్ కు మైండ్ బ్లాంక్ అయ్యింది. తిరిగి ఫోన్ నెంబర్ కాల్ చేయడంతో స్విచ్ ఆఫ్ రావడంతో ఆందోళనకు గురైన సుభాష్ రావు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. స్థానిక సదాశివనగర్ పోలీసులను బాధితుడు ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న సదాశివనగర్ పోలీసులు.
AAP: ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ.. బీజేపీ గూటికి ఢిల్లీ కౌన్సిలర్..
తాజావార్తలు
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
ట్రెండింగ్
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!