రీల్ పోలీస్ యాక్షన్ కంటే ఒక ఆకు ఎక్కువగానే చేస్తున్నారట ఆ రియల్ పోలీస్ ఆఫీసర్. నేను మోనార్క్‌ని అంటూ… ఇల్లీగల్ దందాల మీద విరుచుకు పడుతున్నారట. ప్రజా ప్రతినిధులను సైతం జైలుకు పంపడంతో హీరో ఇమేజ్ సంపాదించుకున్న సదరు ఆఫీసర్ కూడా ఒక నాయకుడి విషయంలో కాస్త సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తున్నారట. అది తెలిసి మంత్రులకు కిందా మీదా కాలిపోతోందట ఇంతకీ ఎవరా ఆఫీసర్? ఏమా కథ? కరీంనగర్ పోలీసు కమిషనర్‌గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో…
పార్టీల మధ్య పోలీస్ అధికారులు నలిగిపోతున్నారా? బండి సంజయ్ ఎపిసోడ్ తర్వాత జరుగుతున్న చర్చ ఇదేనా? అక్కడ సీపీపై బీజేపీ గురిపెట్టిందా? కమలనాథుల హెచ్చరికలను ఎలా చూడాలి? ఈ అంశంలో టీఆర్‌ఎస్ పోలీస్ కమిషనర్‌ను ఎలా కాపాడుతుంది? సీపీ సత్యనారాయణపై బీజేపీ ఫిర్యాదులు..!కరీంనగర్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర చీఫ్, ఎంపీ బండి సంజయ్ జాగరణ దీక్ష తలపెట్టడం.. అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడం.. సంజయ్ అరెస్ట్ చకచకా జరిగిపోయాయి. కోర్టు ఆదేశాలతో జైలు నుంచి బయటకొచ్చారు బండి…
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ లో అరెస్ట్ లపై సీరియస్ అయింది జాతీయ బీసీ కమీషన్. ఈ మేరకు కరీంనగర్ సీపీకి నోటీసులు జారీ చేసింది జాతీయ బీసీ కమీషన్. సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ లు పెట్టారని నలుగురిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు పోలీసులు. దీనిపై నిరసన వ్యక్తం అయింది. ఈ ఘటనపై కమలాపూర్ కి చెందిన కారట్ల దశరథం జాతీయ బీసీ కమీషన్ కి ఫిర్యాదు చేశారు. వెంటనే…
జమ్మికుంట పోలీస్ స్టేషన్ ను కరీంనగర్ కొత్త సీపీ సత్యనారాయణ సందర్శించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ… హుజురాబాద్ నియోజకవర్గంలో ని జమ్మికుంట, హుజురాబాద్ ఇల్లందకుంట ,వీణవంక పోలీస్ స్టేషన్ లను సందర్శించడం జరిగింది ప్రతి మండలంలో లా అండ్ ఆర్డర్ మెంటేన్ చేయడానికి డీఎస్పీ స్థాయి అధికారులు ఉన్నారు. శాంతి భద్రతలను కాపాడటం,ప్రజా శాంతిని భంగం కలిగించే వారి పై కఠిన చర్యలు తీసుకోవడం పోలీస్ లుగా మా బాధ్యత అన్ని తెలిపారు. ఇక హుజురాబాద్…