KTR : కరీంనగర్ పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాన్వాయ్‌లో ఆదివారం ఒక అపశృతి చోటుచేసుకుంది. విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ పద్మజను పార్టీ కార్యకర్త శ్రీకాంత్ బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె కాలు విరిగింది. వెంటనే పార్టీ శ్రేణులు ఆమెను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కేటీఆర్, ఆసుపత్రి అధికారులను సంప్రదించి, ఆమెకు అత్యవసర వైద్యసేవలు అందించాలని సూచించారు. తెలంగాణలో గత 14 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం…