Kanna Lakshminarayana: బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ మరోసారి సొంత పార్టీ నేతను టార్గెట్ చేశారు.. కాపు రిజర్వేషన్ల విషయాన్ని ప్రస్తావించిన ఆయన.. అసలు ఏం సాధించారని ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. కాపులతో సన్మానాలు చేయించుకుంటున్నారు? అని నిలదీశారు.. గుంటూరులో మీడియాలో మాట్లాడిన కన్న.. ఏపీలో 22 శాతం ఉన్న కాపులు ఎటు ఉంటే అటు అధికారం రావటం 1989 నుంచి చూస్తున్నాం.. ఎన్నికల సమయంలోనే ఓట్లు అవసరం కాబట్టి కాపులను వాడుకుంటారు.. అత్యధిక శాతం ఉన్న…
కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సీఎం జగన్ కు లేఖ రాశారు కన్నా లక్ష్మీనారాయణ.. 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాలో 5 శాతం కాపులకు కేటాయించాలని లేఖలో కోరారు.
కాపు రిజర్వేషన్ అంశం ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్కే. తాజాగా కాపు రిజర్వేషన్ల గురించి రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఈ అంశాన్ని ప్రస్తావించారు. కాపులకు ఓబీసీ రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. ఏపీలో కాపులు సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా వెనుకబడి వున్నారని ఆయన అన్నారు. మూడు దశాబ్దాలుగా తమకు న్యాయం జరగాలని కాపులు ఉద్యమాలు చేశారన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినా కాపుల విషయంలో…