ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దీక్ష విరమించారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య. దీక్ష విరమించాలని పవన్ కళ్యాణ్ కోరారు. దీంతో పవన్ సూచన మేరకు దీక్ష విరమిస్తున్నానని ప్రకటించారు హరిరామ జోగయ్య. అంతకుముందు మాజీ మంత్రి చేగొండి హరి రామ జోగయ్యతో మాట్లాడాను… ఇది మూర్ఖపు, మొండి ప్రభుత్వం… కాపులకు రిజర్వేషన్లను వేరే విధంగా సాధించుకుందామని జోగయ్యకు చెప్పాను… జోగయ్య లాంటి వ్యక్తుల సలహాలు.. అనుభవం అవసరం అన్నారు పవన్ కళ్యాణ్.దీక్ష విరమించాలని జోగయ్యకు పవన్ కళ్యాణ్ ఫోన్ చేశారు. జోగయ్యకు నచ్చ చెప్పిన పవన్… దీక్ష విరమించాలని కోరారు. అన్ని రకాలుగా ఆలోచించి కార్యాచరణ రూపొందిద్దామని జోగయ్యకు పవన్ సూచించారు.
Read Also: Ajith: అజిత్ కూతురు అప్పుడే ఇంత పెద్దది అయిపోయిందా.. హీరోయిన్ లా ఉందే
మందులు కూడా వేసుకోకుండా నిరాహార దీక్షకు దిగడం బాధ కలిగిస్తోందన్నారు పవన్. ఒక్కసారిగా ఇంతటి సాహసం చేస్తే ఎలా అంటూ జోగయ్యకు పవన్ బుజ్జగించారు. పవన్ సీఎం కావాలి.. పవన్ ద్వారా రాష్ట్ర ప్రజలు బాగుండాలన్నదే తన కోరికన్నారు జోగయ్య. తాను వచ్చి జోగయ్యను కలుస్తానన్నారు పవన్. జోగయ్య మార్గ దర్శకత్వం వహించాలన్నారు పవన్. సీఎం జగన్ దిగి రావాలన్నదే తన ఆ ఆలోచనన్న జోగయ్య… పవన్ సూచనకు సానుకూలంగా స్పందించారు. దిగిరావాలంటే రాజకీయంగా ఆలోచన చేద్దామన్నారు పవన్. ఆమరణ దీక్షల్లాంటివి వద్దన్న జనసేనాని… కనీసం దీక్షకు విరామం ప్రకటించాలని జోగయ్యను కోరారు పవన్ కళ్యాణ్.
ఇదిలా ఉంటే.. పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో జోగయ్యను ఏలూరు ఆస్పత్రికి తరలించడంపై కాపు నాయకుల నిరసన గళం వినిపించారు. హరిరామజోగయ్య దీక్షకు మద్దతు తెలుపుతూ తక్షణమే జోగయ్య డిమాండ్ చేసిన ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. జోగయ్య నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు కాసేపట్లో చేగొండి హరిరామ జోగయ్య ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కానున్నారు.
Read Also: Russia-Ukraine War: రష్యాను చావుదెబ్బ కొట్టిన ఉక్రెయిన్.. మిస్సైళ్లతో దాడి.. 400మంది మృతి