అధికార టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రమంతా ఒకతీరు… ఖమ్మం జిల్లాలో ఒకతీరు మాదిరిగా వుంది. నేతలు వర్గాలుగా చీలిపోయి అస్థిత్వం కోసం పోరాటం చేస్తూ వుంటారు. తాజాగా పోటాపోటీగా చేసిన కార్ల ర్యాలీలు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. ఖమ్మం జిల్లా వేంసూర్ మండలం కందుకూరు గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి వేరువేరుగా చేరుకుని విజేతలకు బహమతులను ప్రధానం చేశారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ…
జిల్లాల పునర్విభజన ఆ మంత్రులిద్దరికీ తలనొప్పులు తెస్తోందా? విపక్షాల విమర్శలు.. సొంత పార్టీ నేతల ఒత్తిళ్లు.. సీఎంకు ఎలా చెప్పాలో తెలియక సతమతం అవుతున్నారా? తరుణోపాయం తోచడం లేదా? ఉక్కిరిబిక్కిరి అవుతున్న మంత్రులెవరు? జిల్లా విభజన మార్పుకోసం మంత్రులపై ఒత్తిళ్లుప్రకాశం జిల్లాకు చెందిన మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్. ఇద్దరిలో ఒకరు సీఎం జగన్‌కు దగ్గరి బందువు.. మరొకరు ఆయనకు ఆత్మీయంగా ఉండే సహచరుడు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలో ప్రకాశం జిల్లా మూడు ముక్కలైంది.…
నెల్లూరు జిల్లాలో రాజకీయాలు ఎప్పుడూ హాట్ గా వుంటాయి. తాజాగా వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నూతన జిల్లాల ఏర్పాటు విషయంలో మరోసారి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. జిల్లా వ్యవసాయ సలహామండలి సమావేశంలో సుదీర్ఘ ప్రస్తావన చేశారు. సలహా మండలిలో జిల్లా ఏర్పాటు లో అభ్యంతరాలు ప్రభుత్వానికి పంపాలన్నారు. ఆనం వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు రాంకుమార్ రెడ్డి. విభజన వల్ల సోమశిల ప్రాజెక్టు నీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తుతాయన్నారు…