కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్ పేటలో విషాదం చోటుచేసుకుంది. సోమార్ పేట వద్ద నిజాం సాగర్ బ్యాక్ వాటర్ లో ఈతకు వెళ్ళి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. స్నేహితుల తో కలిసి ఈతకు వెళ్ళారు ఎల్లారెడ్డికి చెందిన యువకులు. గల్లంతైన యువకులు మధుకర్ గౌడ్, నవీన్, హర్ష వర్ధన్ గా గుర్తించారు. గల్లంతైన యువకుల కోసం గజ ఈత గాళ్ళత గాలింపు చేపట్టారు. రాత్రి చీకటిగా ఉండటంతో గాలింపుకు అంతరాయం ఏర్పడింది. నేడు ఉదయం మళ్ళీ…
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎక్కువైపోతున్నాయి. కొందరు రోడ్డు ప్రమాదాల్లో, మరికొందరు కాల్పుల్లో మరణిస్తున్నారు. తమ కలల్ని నిజం చేసుకునేందుకు అమెరికా వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్తుండడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. తాజగా అమెరికాలో మరో విషాదం చోటుచేసుకుంది. కామారెడ్డికి చెందిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. Also Read:Shruthi Haasan : చీరకట్టులో శృతిహాసన్ నిండైన అందం.. ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డికి చెందిన…
నేడు తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఇంటర్ బోర్డు కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌తో కలిపి మొత్తం దాదాపు 9.97 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫస్టియర్‌లో 66.89 శాతం, ద్వితీయ సంవత్సరంలో 71.37 శాతం ఉత్తీర్ణత సాధించారు. కాగా.. ఈ ఏడాది కూడా బాలికలదే…
కామారెడ్డి జిల్లాలో మరోసారి కల్తీకల్లు కలకలం రేపింది. గాంధారి మండలం గౌరారంలో కల్తీకల్లు తాగి 30 మంది అస్వస్థకు గురయ్యారు. అందులో ఆరుగురి పరిస్థితి సీరియస్‌గా ఉంది. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ ఐసీయూలో ఆరుగురు బాధితులు చికిత్స పొందుతున్నారు. గౌరారంలోని కల్లు దుకాణంలో కల్లు తాగిన వారు వింతగా ప్రవర్తిస్తున్నారు. కుస్తీ పోటీల సందర్భంగా గౌరారం గ్రామానికి చెందిన గ్రామస్తులు కల్లు తాగారు. కల్లు దుకాణంపై చర్యలు తీసుకోవాలని…
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ అగ్రహారం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పెద్ద చెరువులో మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. దీనిని ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా పోలీసులు ప్రకటించినప్పటికీ, మృతుల కుటుంబ సభ్యులు మాత్రం హత్యగా ఆరోపిస్తున్నారు. భర్త యేసు తన ముగ్గురు పిల్లలతో పాటు రెండో భార్యను చెరువులో తోసి హత్య చేశాడని చిన్నారుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు తక్షణమే…
అత్తాపూర్ మెహిందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య కేసులో కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో కీలక ఆధారాలను పరిశీలించిన పోలీసులు ఆమె భర్త అమిత్ లోయాను అదుపులోకి తీసుకున్నారు. పింకీ సంపాదించిన డబ్బులు తీసుకుని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం, ఆ తర్వాత జరిగిన ఆర్థిక నష్టాలే ఈ విషాదానికి కారణమైనట్లు దర్యాప్తులో వెల్లడైంది. పోలీసుల కథనం ప్రకారం.. పింకీ సంపాదించిన రూ. 7 లక్షలను అమిత్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టగా, లాభంతో మొత్తం రూ.…
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ అగ్రహారం గ్రామంలో పండగ పూట విషాదం చోటుచేసుకుంది. ఊరి చివర్లో ఉన్న చెరువులో పడి తల్లి, ఇద్దరు కుమారులు, కుమార్తె మృతి చెందారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన వారు మౌనిక (26), మైథిలి (10), వినయ్ (7), అక్షర (9)గా గుర్తించారు. మృతదేహాల్లో మౌనికదే ఇంకా లభ్యం కాలేదు.
నిర్లక్ష్యం, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడం వంటి కారణాలు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. మితిమీరిన వేగంతో, అజాగ్రత్తగా వాహనాలను నడుపుతూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓవర్ స్పీడ్ తో వెళ్తున్న బైకు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువతి తీవ్రంగా గాయపడింది. గాయపడిన ఆమెను కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.…
కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రామారెడ్డి మండలం స్కూల్ తండాలో ఇద్దరు విద్యార్థినిలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తరగతి గదిలో తోటి విద్యార్థినిల వేధింపుల వల్ల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.