కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్ పేటలో విషాదం చోటుచేసుకుంది. సోమార్ పేట వద్ద నిజాం సాగర్ బ్యాక్ వాటర్ లో ఈతకు వెళ్ళి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. స్నేహితుల తో కలిసి ఈతకు వెళ్ళారు ఎల్లారెడ్డికి చెందిన యువకులు. గల్లంతైన యువకులు మధుకర్ గౌడ్, నవీన్, హర్ష వర్ధన్ గా గుర్తించారు. గల్లంతైన యువకుల కోసం గజ ఈత గాళ్ళత గాలింపు చేపట్టారు. రాత్రి చీకటిగా ఉండటంతో గాలింపుకు అంతరాయం ఏర్పడింది. నేడు ఉదయం మళ్ళీ గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. యువకులు గల్లంతు కావడంతో కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.