Kamareddy: సార్ నా భ్యార్య నన్ను రోజూ కొడుతోంది.. డ్రాయర్ మీద ఠాణాకు వచ్చిన బాధితుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాలం మారుతోంది. గతంలో భర్తలు తాగొచ్చి భార్యలను చితకబాదేవారు. మారిన చట్టాలు, కఠినమైన శిక్షలు అమలవుతుండటం, ఆడవాళ్ల కష్టాలపై ప్రభుత్వాలు, పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టటంతో.. తమ భార్యలపై చేయిచేసుకోవాలంటే భర్తలు జంకుతున్నారు. గృహహింస, వరకట్న వేధింపుల చట్టం లాంటి కేసులు వారికి రక్షణగా నిలుస్తున్నాయి. ఇదంతా నాణేనికి ఒకవైపు అయితే.. మరోవైపు కూడా ఉందండోయ్. ప్రస్తుతం భార్యలు కూడా చేతులకు పనిచెబుతున్నారు. నాలుగు గోడల మధ్య ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నాయో తెలియదు కానీ.. ఇప్పుడు మాత్రం ఒకటి వెలుగులోకి వచ్చింది. తన భార్య రోజూ కొడుతోందంటూ.. ఓ భర్త కామారెడ్డి జిల్లా బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. మామూలుగా పోలీస్ స్టేషన్‌కు వెళితే తన బాధ అర్థం చేసుకుంటారో లేదో అనుకున్నాడో ఏమో.. ఒంటి మీద బట్టలు లేకుండా.. డ్రాయర్ తో స్టేషన్ కు చేరుకున్నాడు. పోలీసులతో తన బాధను చెప్పుకున్నాడు.
READ MORE: AI for Google Search: ఇక గూగుల్ సెర్చ్ లో కుడా ఏఐ.. ఈ 8 ఫీచర్లు అస్సలు మిస్ కావద్దు!
Also Read
- Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
- Supreme Court: "ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు".. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
- తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
- Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
తనకు భార్య నుంచి కాపాడాలంటూ.. పోలీసులను ఆ బాధిత భర్త వేడుకున్నాడు. తనను ప్రతిరోజూ కొడుతుందంటూ గుక్కతిప్పుకోకుండా తన బాధలు చెప్పుకున్నాడు. ఆ భర్త బాధలు విన్న పోలీసులు కూడా అతని మీద సానుభూతి వ్యక్తం చేసి.. భార్యాభర్తలకు సర్ధి చెప్పి పంపించారు. ఆ భర్త బాధలు విన్న స్థానికులు.. “నీ కష్టం పగోనికి కూడా రావొద్దు భయ్యా..” అంటూ సానుభూతి ప్రకటించారు. ఎంత బాధ అనుభవిస్తే.. ఇలా బయటకు వచ్చి తన గోడు వెల్లబోసుకుంటాడంటూ జనాలు చర్చించుకుంటున్నారు. అయితే.. ఆ భార్య తన భర్తను ఎందుకు కొడుతుంది.. అతను ఎలాంటి పనులు చేస్తే ఆమె ఇలా రియాక్ట్ అవుతుందన్నది తెలియాల్సి ఉంది. కాగా ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తాజావార్తలు
-
Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
-
Supreme Court: “ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
-
తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!