వరంగల్‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘కాకతీయ వైభవ సప్తాహం’ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సందడి చేసింది. ఈ ఛాలెంజ్‌లో కాకతీయ 22వ వారసుడైన కమల్ చంద్రభంజ్ దేవ్ పాల్గొని, స్వయంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాకతీయుల పాలనలో తమ పూర్వీకులు ప్రకృతికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని, అందులో భాగంగానే గొలుసు చెరువులు తవ్వించారని చెప్పారు. అడవుల్ని రక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారని, ఇప్పుడు ఆ ఒరవడి కేసీఆర్…