స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో అప్పుడప్పుడు ఈవెంట్లు జరుగుతుంటాయి. ఆ సమయంలో గురువులు, విద్యార్థులు సరదాగా గడుపుతుంటారు. సహజంగా విద్యార్థులు చేసే కార్యక్రమాలను స్టేజ్ కింద కూర్చుని వీక్షిస్తుంటారు. మరీ అంతగా విద్యార్థులు రిక్వెస్ట్ చేస్తే.. టీచర్లు గానీ.. ప్రొఫెసర్లు గానీ కాలు కదుపుతారు. అంతేకానీ అదుపు తప్పరు.