Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు.. పవన్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ముందుగా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి రాజమండ్రి విమానాశ్రయం చేరుకోనున్న పవన్ కల్యాణ్.. అక్కడి నుంచి హెలికాప్టర్లో కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌కు వెళ్తారు. ఆ తరువాత నేరుగా కాకినాడ కలెక్టరేట్‌కు చేరుకుంటారు. దివీస్ ఫార్మా కంపెనీల నుంచి విడుదలయ్యే రసాయనాలతో ఉప్పాడ సముద్ర తీరం కలుషితమవుతోందని.. మత్స్య సంపద క్షిణించి జీవనోపాధి…
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎన్నో షాకింగ్ ఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. అందులో కొన్ని ఘటనలు ఒళ్లు గగుర్పొడిచే రీతిలో ఉంటే.. మరికొన్ని హృదయ విదారకంగా ఉంటాయి. మరికొన్ని అయితే నమ్మలేని రీతిలో ఉంటాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే తాజాగా చోటుచేసుకుంది. ఓ వ్యక్తి లారీ కింద పడ్డా ఏమీ కాలేదు. ఈ వీడియో చూస్తే.. పెద్దలు చెప్పిన ఓ మాట తప్పక గుర్తొస్తోంది. ‘వీడికి ఇంకా భూమ్మీద నూకలు ఉన్నాయిరో’. ఇక వివరాల్లోకి వెళితే……
ఆ టీడీపీ ఎమ్మెల్యే సీటు కింద పార్టీ అధిష్టానమే బాంబు పెట్టిందా? ఎక్స్‌ట్రాలు చేస్తే ఇలాగే ఉంటుందని మిగతా వాళ్ళకు కూడా సందేశం పంపిందా? కొత్త నేత చేరికను అడ్డుకోవాలని ఎమ్మెల్యే ఎంత ప్రయత్నించినా మాకంతా తెలుసునని పార్టీ పెద్దలు నిర్మొహమాటంగా చెప్పేశారా? శాసనసభ్యుడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే మనుషులతో అంటకాగుతున్నారన్న ఆరోపణల్లో నిజమెంత? ఎవరా ఎమ్మెల్యే? అధిష్టానం పెట్టిన ఆ బాంబ్ ఏంటి? కర్రి పద్మశ్రీ… ఎమ్మెల్సీ. వైసీపీ ప్రభుత్వంలో గవర్నర్ కోటాలో అవకాశం వచ్చింది.…
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు వన్ ప్లస్ వన్ గన్‌మెన్‌ను కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. 2014 నుంచి 2019 వరకు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారాయన. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోవడంతో సెక్యూరిటీని ఉపసంహరించుకున్నారు. అయితే ... తాజాగా తనకు భద్రతా కారణాల రీత్యా ప్రొటెక్షన్ కావాలని ప్రభుత్వాన్ని అడిగారట మాజీ ఎమ్మెల్యే. ఏం... ఉన్నట్టుండి ఆయనకు ఏం ఆపద ముంచుకొచ్చింది?
వినాయక చవితి పండగ పూట కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం వాలీబాల్ ఆడుకునేందుకు పోల్లు నిలబెడుతున్న ఆరుగురు యువకులకు విద్యుత్ షాక్ తగిలింది. ఈ ఘటనలో ఏడిద చరణ్ (19) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని మెరుగైన వైద్యం కోసం కాకినాడకు తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. చరణ్ కుటుంబానికి…
సూపర్ సిక్స్.. సూపర్ హిట్ అయ్యిందన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..కాకినాడ జిల్లా పెద్దాపురంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర సభలో ఆయన మాట్లాడుతూ.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు.. అంటు వ్యాధులు రావడానికి ప్రధాన కారణం చెత్త, అపరిశుభ్రతేనన్న ఆయన.. గత వైసీపీ ప్రభుత్వం చెత్తపై పన్ను వేసింది.. కానీ, చెత్తను మాత్రం తీయలేదన్నారు.. ప్రజారోగ్యాన్ని వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు..
కాకినాడ రూరల్ టీడీపీ కో ఆర్డినేటర్ పిల్లి సత్తిబాబు పదవికి రాజీనామా చేశారు. కారణాలను వివరిస్తూ... పార్టీ అధిష్టానానికి సుదీర్ఘ లేఖ రాశారాయన. అదంతా ఒక ఎత్తయితే... ఈ పరిణామాల గురించి మాత్రం తెగ గుసగుసలాడేసుకుంటోంది లోకల్ టీడీపీ కేడర్. ఏ ప్రయోజనాలు ఆశించి పిల్లి ఈ స్టంట్స్ చేస్తున్నారన్నది కేడర్ క్వశ్చన్. అధికార పార్టీలో కో ఆర్డినేటర్ పదవి అంటే... ఒక స్థాయి, స్థానం ఉంటుంది. అలాంటి పోస్ట్‌ను కూడా పిల్లి దంపతులు ఎందుకు వివాదాస్పదం…
కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పదవికి పిల్లి సత్తిబాబు రాజీనామా చేశారు.. మండలాధ్యక్షుడు నియామకం విషయంలో ఉదయం ఘర్షణ పడ్డారు టిడిపి కోఆర్డినేటర్, కోఆర్డినేటర్ వర్గాలు.. ఈ వ్యవహారంలో ఆయన టీడీపీ పదవికి గుడ్ బై చెప్పడం చర్చగా మారింది..