Sister idol installed: అక్కంటే ప్రాణం.. రాఖీ పండుగ రోజు విగ్రహం ఆవిష్కరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనుబంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి.. దేశవ్యాప్తంగా చాలా ఘనంగా రాఖీ పౌర్ణమి జరుపుకుంటారు. రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్, రాఖీగా పిలవబడే ఈ పండుగ సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా, వారి బంధం పటిష్టంగా ఉండాలని నిర్వహిస్తారు.. సోదర సోదరీమణులు ఒకరికి ఒకరు అండగా ఉంటామని భరోసా ఇచ్చే పండుగ ఇది… మానవ సంబంధాలకు, అనుబంధాలకు ప్రతీకగా నిలుస్తుంది.. మెట్టినింటికి వెళ్లిన తర్వాత పుట్టినింటికి దూరమైన ప్రతీ ఆడపడుచు ఈ పండుగ రోజు ఖచ్చితంగా తన పుట్టింటికి వచ్చే రోజు ఇదే అని చెప్పాలి.. అన్నా చెల్లెళ్ళు , అక్కా తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ రోజు.. తన జీవితంలో జరిగిన ఓ ఘటనను గుర్తుచేసుకున్న ఓ సోదరుడు.. నాలా మరొకరికి జరగ కూడదని.. ప్రచారం నిర్వహిస్తున్నాడు.. అంతే కాదు.. తన అక్కపై ఉన్న ప్రేమని.. ఓ విగ్రహంగా మార్చి.. ఇంటి దగ్గర ఆవిష్కరించాడు..
Read Also: Chikoti Praveen Petition: ఈడీ దర్యాప్తు పూర్తయ్యే వరకు పోలీస్ భద్రత కావాలి..!
Also Read
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
అక్కను మర్చిపోలేక ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించిన తమ్ముడి విషానికి వస్తే.. కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మరణించిన అక్క విగ్రహాన్ని తయారు చేయించి రాఖీ సందర్భంగా ఆవిష్కరించాడు తమ్ముడు..శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన మణి.. బైక్ ప్రమాదంలో మృతి చెందింది.. బైక్‌పై వెళ్తుండగా.. చున్ని బైక్ చక్రంలో ఇరుక్కుని కొందపడిపోయి ఆమె ప్రాణాలు విడిచింది.. అయితే, తన సోదరిలా ఎవరికీ జరగ కాకూడదని సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహిస్తున్నాడు తమ్ముడు రాజా.. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆమె విగ్రహాన్ని గ్రామంలో ఊరేగించి ఇంటిదగ్గర ఆవిష్కరించాడు.. తన సోదరిపై తనకున్న ప్రేమను చాటుతూనే.. ఆమె తనకు దూరమైన గడియలను గుర్తు చేసుకుంటూ.. మరొకరి జీవితంలో ఇలాంటి పరిస్థితి రాకూడదు అంటున్నారు రాజా..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..