గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ పోలీసులు సిద్ధం.. సీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా కొలువుదీరిన గణేషుడు భక్తుల నుంచి పూజలందుకుంటున్నాడు. పూజలు, భజనలతో గణపయ్య భక్తులు భక్తిపారవశ్యంలో మునిగితేలుతున్నారు. కాగా కొందరు మూడో రోజు నుంచే నిమజ్జనం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ గణేష్ నిమజ్జనానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ పోలీసులు సిద్ధం అని తెలిపారు. ఈ ఏడాది నిమజ్జనానికి 30 వేల మంది…
Kakatiya University: వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ భూముల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించొద్దని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగాయి. రిజిస్టర్ ఛాంబర్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ బాలకిష్టారెడ్డి, కాకతీయ వర్సిటీ ఉపకులపతి కె.ప్రతాప్‌రెడ్డి తదితరులు ఫలితాలను విడుదల చేశారు. 32,106 మంది ఎడ్‌సెట్ పరీక్ష రాయగా 30,944 మంది ఉత్తీర్ణత నమోదైంది. అంటే 96.38శాతం అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. మొదటి మూడు స్థానాల్లో అబ్బాయిలదే హవా.
తెలంగాణలోని 9 యూనివర్సిటీలకు కొత్త వీసీల నియామకం ఫైల్‌పై తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. దీంతో అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా ఎం. కుమార్, పాలమూరు యూనివర్సిటీ వీసీగా జీఎన్ శ్రీనివాస్, శాతవాహన యూనివర్సిటీ వీసీగా ఉమేష్ కుమార్, కాకతీయ యూనివర్సిటీ వీసీగా ప్రతాప్ రెడ్డి, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీగా అల్తాఫ్ హుస్సేన్, తెలంగాణ యూనివర్సిటీ వీసీగా యాదగిరి రావు, తెలుగు యూనివర్సిటీ వీసీగా నిత్యానందరావు, వ్యవసాయ…
Kakatiya University: కాకతీయ యూనివర్సిటీలో అర్ధరాత్రి ఉద్రిక్తత వాతావణం చోటుచేసుకుంది. కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్ మల్లారెడ్డిని పోతన లేడీస్ హాస్టల్ లో తాళం వేసి యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థులు బంధించారు.
CM Revanth Tweet:కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం 2024ను యువకవి, రచయిత రమేష్ నాయక్‌కు అందించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ప్రత్యేక ట్వీట్ చేశారు.
వరంగల్ జిల్లా కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వరంగల్ జిల్లా ఇంఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.
Warangal KU: కాకతీయ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకమైన ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. డిసెంబర్ 28, 29, 30 తేదీల్లో జరిగే 82వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్‌కు కేయూ ఇప్పటికే ఆమోదం తెలిపింది.
కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. వర్సిటీ మహిళా హాస్టల్ లో చాప కింద నీరులా ర్యాగింగ్ భూతం విస్తరిస్తోంది. జూనియర్ విద్యార్థినిలపై సీనియర్ విద్యార్థినులు ర్యాగింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలతో ఏకంగా 81 మంది స్టూడెంట్స్ ను వర్సిటీ అధికారులు హాస్టల్స్ నుంచి సస్పెండ్ చేశారు.
వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల జాక్ నేతల దీక్షకు ఎమ్మెల్యే సీతక్క మద్దతు తెలిపారు. దీక్షా శిబిరంలో విద్యార్థులతో కూర్చొని సమస్యలు తెలుసుకున్న సీతక్క.. breaking news, latest news, Telugu news, mla seethakka, cm kcr, congrss, brs, kakatiya university