Kakatiya University: వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ భూముల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించొద్దని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగాయి. రిజిస్టర్ ఛాంబర్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇటీవల కేయూ భూములను ఇంటెగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు కేటాయించే విధంగా యూనివర్సిటీ పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. కేయూ పాలకవర్గం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలకు చెందిన నేతలు, విద్యార్థులు కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.
Read Also: Asaduddin Owaisi: మమ్మీ, మమ్మీ.. వాళ్లు చాక్లెట్ దొంగిలించారని ఏడవకూడదు..
అయితే, కాకతీయ యూనివర్సిటీ భూములను యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలుకు ఇచ్చేందుకు సహకరిస్తున్న వీసీతో పాటు ఎమ్మెల్యేలను పదవి నుంచి తొలగించాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఇది విద్యాను కమర్షియలైజ్ చేయడమే కాదు, ప్రభుత్వ వనరులను ప్రైవేట్ వ్యక్తుల చేతులకు అప్పగించడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణ పనులను నిలిపివేయాలని కోరారు. కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్టర్ ఛాంబర్ లో ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేసి.. కేయూ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో యూనివర్సిటీ పరిసరాల్లో తీవ్ర గందరగోళం ఏర్పడింది.