ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయంలో పోలీసులు అడుగు పెట్టాలంటే వైస్ ఛాన్సలర్ రమేష్ పర్మిషన్ అవసరం అని ఆయన అన్నారు. విద్యార్థుల సమస్యను పరిష్కరించాల్సిన వీసీ పోలీసులతో విద్యార్థులపై దాడి చేయించడం హేయమైన చర్య అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేయూలో పీహెచ్డీ కేటగిరి-2 అడ్మిషన్ లలో ఎలాంటి అవకతవకలు జరుగలేదు అని ఆయన తేల్చి చెప్పారు. పారదర్శకంగానే అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగించామన్నారు. దౌర్జన్యం చేస్తే పాలకవర్గం లొంగుతుందని కొందరు భావిస్తున్నారు.. ప్రతిభ ఉన్నవారికే సీట్లు కేటాయించామని వీసీ రమేష్ తెలిపారు.
కాకతీయ విశ్వవిద్యాలయంలో గొడవ చేసిన వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామన్నారు. సీపీ సమక్షంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కొట్టారని వారు ఆరోపిస్తున్నారు.. ఏబీవీపీ విద్యార్థులు 4న డోర్ పగులగొట్టి వీసీ కార్యాలయంలోకి చొరబడ్డారు అని సీపీ తెలిపారు.
రాష్ట్రంలో బీజేపీ-TRS వార్ జరుగుతున్న నేపథ్యంలో గవర్నర్ వరంగల్ పర్యటన ఆసక్తి రేపుతోంది. ఎన్నో పోరాటాలకు పురుడుపోసిన కాకతీయ యూనివర్సిటీలో గవర్నర్ పర్యటన హై టెన్షన్ సృష్టిస్తోంది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై వరంగల్‌లో పర్యటించనున్నారు. అక్కడ కాకతీయ యూనివర్సిటీలో జరిగే 22వ స్నాతకోత్సవానికి హాజరయ్యారు.. 2019-2020 సంవత్సరంలో వివిధ కోర్స్ లలో పీ.హెచ్.డీ పూర్తి చేసుకున్న 56 మందికి డాక్టరేట్ పట్టాలు ప్రదానం చేయడంతో పాటు 276 మందికి గోల్డ్ మెడల్స్ ప్రదానం…
మానవ సంపద నిర్వీర్యం కావడం తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదన్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్… హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల మహాదీక్షకు మద్దతు తెలిపిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2009 కేసీఆర్ దీక్ష విరమణ జరిగిన వార్త కేయూ 2వ గేటు వద్ద విన్నాను.. నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ ఉద్యమం జరిగింది. విద్యార్థి లోకం జాక్ గా ఏర్పడి దీక్షలు చేశారని గుర్తుచేశారు.. ఇక, మానవ సంపద నిర్వీర్యం కావడం…