బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ బాలకిష్టారెడ్డి, కాకతీయ వర్సిటీ ఉపకులపతి కె.ప్రతాప్‌రెడ్డి తదితరులు ఫలితాలను విడుదల చేశారు. 32,106 మంది ఎడ్‌సెట్ పరీక్ష రాయగా 30,944 మంది ఉత్తీర్ణత నమోదైంది. అంటే 96.38శాతం అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. మొదటి మూడు స్థానాల్లో అబ్బాయిలదే హవా. హైదరాబాద్‌కి చెందిన గణపతిశాస్త్రి మొదటి 126 మార్కులతో మొదటి స్థానంలో నిలిచాడు. 121 మార్కులతో రెండో ర్యాంక్‌ను హైదరాబాద్‌కి చెందిన శరత్ చంద్రకు సొంతం చేసుకున్నాడు. మూడో ర్యాంకు వరంగల్‌కి చెందిన నాగరాజుకు వచ్చింది. నాగరాజు ఈ పరీక్షలో 121 మార్కులు సాధించాడు.
READ MORE: Rishabh Pant: సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్న రిషబ్ పంత్.. ఎంఎస్ ధోని రికార్డు బ్రేక్!