Kakatiya University: కాకతీయ యూనివర్సిటీలో అర్ధరాత్రి ఉద్రిక్తత వాతావణం చోటుచేసుకుంది. కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్ మల్లారెడ్డిని పోతన లేడీస్ హాస్టల్ లో తాళం వేసి యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థులు బంధించారు. యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్ గదిలో పై పెచ్చులు ఊడి,బాలికలు నిద్రిస్తున్న బెడ్ పై పడటంతో విద్యార్థినిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాణాలతో చెలగాటo ఆడుతున్నారని వెంటనే రిజిస్టర్ రాజీనామా చేయాలంటూ పోతన హాస్టల్ ఎదుట అర్థరాత్రి ధర్నాకు దిగారు. హాస్టల్ నందు సరైన సదుపాయాలు లేవంటూ, పాములు, కుక్కలు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుళ్లిపోయిన గుడ్లు పెడుతున్నారని, ఎన్నిసార్లు సంబంధించి అధికారులకు చెప్పిన ఇలాంటి స్పందన లేదని విద్యార్థినులు మండిపడ్డారు.
Read also: Mamata Banerjee: నరేంద్ర మోడీ సర్కార్ ఐదేళ్ల పాటు కొనసాగడం కష్టమే..?
పోతన హాస్టల్ నందు చెకింగ్కీ వచ్చిన రిజిస్టర్ ని తాళం వేసి బంధించి తమ సమస్యలు పరిష్కరించే వరకు వదిలిపెట్టే లేదని విద్యార్థుల డిమాండ్ చేశారు. కాకతీయ యూనివర్సిటీ పోతన గర్ల్స్ హాస్టల్ లో స్లాబ్ పై పెచ్చులు ఊడి కింద పడింది అదృష్టం కొద్దీ ఆ రూంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. ఇటీవల ఫ్యాను ఊడి పడి ఒక అమ్మాయికి తల పగిలిన ఘటన చోటుచేసుకుంది. .. అప్పుడు అందరు వచ్చారు హడావిడి చేశారు.. అంతే కానీ వాళ్ళని బిల్డింగ్ నీ చేంజ్ చేసే ప్రయత్నం ఎవరు చేయలేదన్నారు. మళ్లీ రెండోసారి హాస్టల్ గదిలో పెచ్చులు ఉడిపడంతో ఆందోళనలు దిగామని తెలిపారు. ఎవరు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పురాతన భవనాలలో హాస్టల్స్ నిర్వహిస్తున్న పరిస్థితి అన్నారు. ఎప్పుడు ఏ భవనం పెచ్చులు ఊడి పడతాయా, ఎవరిపై ఫ్యాన్లు ఊడి పడతాయా అన్న భయంతో బిక్కుబిక్కుమంటూ విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీ హాస్టల్లో గడుపుతున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Venkateshwara Stotram: ఈ స్తోత్ర పారాయణం చేస్తే సాక్షాత్తు వేంకటేశ్వర స్వామి ధనాన్ని ప్రసాదిస్తాడు