చారిత్రక వరంగల్ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ వైభవ వారోత్సవాలను నిర్వహించబోతుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఓరుగల్లు ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పాలించిన కాకతీయుల ఘనకీర్తిని చాటేందుకు వరంగల్‌లో కాకతీయుల ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ‘కాకతీయ సప్తాహం’ పేరున ఈ నెల ఏడవ తేదీనుండి వారం రోజులపాటు అత్యంత ఘనంగా ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ…