జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శలు చేశారు. వ్యవసాయం అంటే తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఆరోపించారు. సినిమాల్లో నటించడం, కోట్లు సంపాదించడం మినహా పవన్ కళ్యాణ్‌కు వ్యవసాయం అంటే తెలియదని ఎద్దేవా చేశారు. అన్నీ పాములు ఆడితే ఏలిక పాము కూడా లేచి ఆడిందన్న చందంగా పవన్ కళ్యాణ్ వ్యవసాయం గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. కనీసం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచే అర్హత కూడా పవన్…
ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్ కేబినెట్ 2లో మంత్రి పదవి ఆశించి భంగపడిన నేతలు చాలా మందే ఉన్నారు.. తమ మంత్రి పదవి ఊడిపోవడంతో సిట్టింగులు కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేయగా.. తొలిసారి పదవి రాలేదు.. మలి కేబినెట్‌లోనైనా అవకాశం వస్తుందని ఎదురుచూసినవారిలో కూడా కొంతమందికి మొండి చేయి చూపడంతో అసంతృప్తిగా ఉన్నారు.. ఇప్పటికే చాలా మందిని బుజ్జగించారు వైసీపీ నేతలు.. అయితే, ఇవాళ కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితో భేటీ అయ్యారు మంత్రి కాకాణి…
అమరావతి సచివాలయంలో నూతన వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన రూ.1,395 కోట్లతో 3.75 లక్షల ఎకరాలకు మైక్రో ఇర్రిగేషన్ అవకాశం కల్పించే ఫైలుపై మొదటి సంతకం చేశారు. అంతేకాకుండా 3500 ట్రాక్టర్లను వైఎస్ఆర్ యంత్ర పథకం కింద ఇచ్చే ఫైలుపై రెండో సంతకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ మంత్రిగా తనకు అవకాశం ఇచ్చిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 43 వేల…
నెల్లూరు కోర్టులో జరిగిన అంశంపై తీవ్రంగా స్పందించారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. నా మీద 2017లో సోమిరెడ్డి కేసు పెట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రెండు సార్లు చార్జిషీట్ చేస్తే కోర్టు ఇది సరైన కేసు కాదని చెప్పింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక చార్జిషీట్ ఫైల్ అయ్యింది. దొంగతనాలు చేయాల్సిన అవసరం మాకేమన్నా ఉందా, దొంగతనం చేసి కాగితాలు బయటపడేస్తారా? ఒక పథకం ప్రకారంగా కావాలని చేసి కక్షదారులు చేసి ఉండొచ్చు అనే అనుమానం ఉందన్నారు…
సింహపురి రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగా వుంటాయి. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (AnilKumar Yadav) ఆదివారం భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసి తన బలం, బలగం ఏంటో చూపించారు. అదే టైంలో తాజా మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కూడా తానేంటో నిరూపించుకున్నారు. ఇదిలా వుంటే నెల్లూరు జిల్లాలో మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి నియోజకవర్గమైన సర్వేపల్లిలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పర్యటించడం చర్చనీయాంశంగా మారింది. నెల్లూరు బహిరంగసభలో అనిల్ కుమార్ యాదవ్…
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రులు ఎవరు అనే దానికి తెరపడింది.. అయితే, అక్కడక్కడ అసంతృప్తులు వ్యక్తం అవుతున్నాయి.. ఒకరు ఏకంగా రాజనీమాకు సిద్ధపడినట్టు తెలుస్తుండగా.. మరోసారి అవకాశం రాలేదనే అసంతృప్తి వ్యక్తంచేసేవారు లేకపోలేదు.. ఈ నేపథ్యంలో.. కేబినెట్‌లో కొత్తగా అవకాశం దక్కి.. కాసేపట్లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. మంత్రి పదవి రావటం సంతోషంగా ఉందన్నారు.. అయితే, ఆశించిన తర్వాత పదవి దక్కలేదని కొంత మందికి…
ఏపీ అసెంబ్లీలో సమావేశం అయింది ప్రివిలేజ్ కమిటీ (Privilege Commitee). కమిటీ ముందు హాజరయ్యారు టీడీపీ నేత కూన రవి కుమార్. ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. గతంలో స్పీకర్ పై ఆరోపణలు చేసిన కూన రవికుమార్ పై విచారణ జరిపాం అనీ, గతంలో వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పాం. అప్పుడు ఆయన రాలేదు. ఈరోజు వ్యక్తిగతంగా హాజరయ్యారని ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్ధనరెడ్డి చెప్పారు. కూన రవి కుమార్ చేసిన…
టీడీపీ నేత కూన రవికుమార్‌పై ఏపీ ప్రివిలేజ్ కమిటీ సీరియస్ అయ్యింది.. ప్రివిలేజ్ కమిటీ ముందు కూన రవి హాజరుకాకపోవడాన్ని ధిక్కారంగా భావిస్తున్నామని చైర్మన్ కాకాని గోవర్ధన్‌రెడ్డి అన్నారు.. ఇవాళ వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కూన రవిని ఆదేశించింది ప్రివిలేజ్ కమిటీ.. కానీ, వారు హాజరు కాలేదు.. ఇక, ప్రివిలేజ్ కమిటీ తదుపరి సమావేశం వచ్చే నెల 14వ తేదీన జరపాలని నిర్ణయించారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రివిలేజ్ కమిటీ చైర్మన్…